Moviesఆ సూపర్ డూపర్ హిట్ సినిమా సీక్వెల్ లో రామ్ చరణ్.....

ఆ సూపర్ డూపర్ హిట్ సినిమా సీక్వెల్ లో రామ్ చరణ్.. RRR కి మించిన హిట్ పక్కా..రాసిపెట్టుకోండి..!!

ఎస్ .. ఇది నిజంగా మెగా అభిమానులకు మంచి కిక్ ఇచ్చే గుడ్ న్యూస్ అనే చెప్పాలి . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ ప్రజెంట్ గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతుంది అంటూ నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఆ తర్వాత చరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు సనా సినిమా ద్వారా తనలోని మరో యాంగిల్ ని బయట పెట్టబోతున్నాడు .

ఇది మొత్తం స్పోర్ట్స్ డ్రామకి సంబంధించిన సినిమాగా తెలుస్తుంది . అయితే ఇలాంటి క్రమంలోనే చరణ్ బాలీవుడ్ లో కూడా ఓ సినిమాకి కమిట్ అయ్యాడు అన్న వార్త అభిమానులను ఆకట్టుకుంటుంది . చరణ్ బాలీవుడ్ లో సినిమా చేయబోతున్నాడట . అది కూడా పాపులర్ ఫ్రాంచైజీ ధూమ్ 4 లో అంటూ తెలుస్తుంది . 2013లో వచ్చిన ధూమ్ చిత్రానికి ఇప్పుడు నాలుగో సీక్వెల్ని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ .

ఇందులో రామ్ చరణ్ తో నటింపజేయాలనుకుంటున్నారట. ప్రజెంట్ అవే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతుంది. అయితే పోలీస్ ఆఫిసర్ పాత్రలో హీరో షారుక్ ఖాన్ నటిస్తారు అని ఇన్నాళ్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది . కానీ ఇప్పుడు ఆ పాత్ర కోసం రామ్ చరణ్ ని అడుగుతున్నారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news