Moviesసుమ సంపాదించిన ఆస్తిలో ఒక్క రూపాయి కూడా రాజీవ్ కి దక్కదా..?...

సుమ సంపాదించిన ఆస్తిలో ఒక్క రూపాయి కూడా రాజీవ్ కి దక్కదా..? పకడ్బందీగా వీలునామా రాసేసిందా..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ కపుల్ కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు యాంకర్ సుమ యాక్టర్ రాజీవ్ కనకాల . బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ప్రపంచం సృష్టించుకుని అలుపెరుగని యాంకర్ గా ముందుకు దూసుకెళ్తున్న యాంకర్ సుమ కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో యాంకరింగ్ చేస్తూ కోట్ల ఆస్తిని కూడ పెట్టింది. అంతేకాదు భర్త రాజీవ్ కనకాల కూడా ముందు సినిమాలలో బాగా నటించేవాడు . ఇప్పుడు బాగా తగ్గించేసాడు .

వయసు పెరిగిపోతూ ఉండడం ..బాగా బరువు పెరగడంతో ఆయనకు అవకాశాలు తగ్గాయి. ఇదే క్రమంలో యాంకర్ సుమ మాత్రం మంచిగా ఇండస్ట్రీలో బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది. నిజానికి యాంకర్ సుమ సంపాదించిన ఆస్తి ఇప్పుడు రాజీవ్ కనకాల అనుభవిస్తున్నాడు అనే పుకార్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి . అయితే గతంలో రాజీవ్ కనకాల సుమ విడిపోవాలి అనుకున్నారు అన్న వార్తలు ఏ విధంగా వైరల్ అయ్యాయో మనం చూసాం.

“భార్యాభర్తలు అన్నాక గొడవలు సహజం.. ఒక్కొక్క సందర్భాలలో అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది . కానీ పిల్లల గురించి ఆలోచించి మేము సైలెంట్ గా అయిపోయామంటూ” స్వయాన సుమనే చెప్పకు వచ్చింది. అంతేకాదు ఆ తర్వాత వీళ్ళ వైవాహిక జీవితం పై రకరకాల వార్తల వైరల్ అయ్యాయి. అలాంటి సమయంలోనే యాంకర్ సుమ తన తధనానంతరం..తాను సంపాదించిన ఆస్తి మొత్తం తన ఇద్దరు బిడ్డలకు సరిసమానంగా రావాలి అని ..ఒక రూపాయి కూడా మిగతా వాళ్లకు వెళ్లకుండా పకడ్బందీగా వీలునామా రాసిందట .

అంతేకాదు ఉన్న ఇల్లు రెండు మూడు ప్రాపర్టీలు తప్పిస్తే మిగతా వన్ని ఆమె సంపాదించిన ఆస్తి మొత్తం కూడా కొడుకు రోషన్ కూతురు మనస్వినీ పేరు మీదికి వచ్చేలా వీలునామా రాసింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత అదంతా ఫేక్ అంటూ పలు ఇంటర్వ్యూలలో సుమ రాజీవ్ కొట్టి పడేశారు . ఇలాంటి వార్తలు విని మేము నవ్వుకున్నామని సీరియస్ గా తీసుకోమని చెప్పుకొచ్చారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news