Newsవామ్మో.. నిఖిల్ కి ప్రభాస్ అంటే ఇంత పిచ్చి నా..? సలార్...

వామ్మో.. నిఖిల్ కి ప్రభాస్ అంటే ఇంత పిచ్చి నా..? సలార్ కోసం ఏం చేశాడో చూడండి ..నిజమైన ఫ్యాన్ అంటే వీడే రా బాబు..!!

సలార్ .. సలార్.. సలార్ ఏ రాష్ట్రమైనా .. ఎవ్వరి నోట విన్న ఇప్పుడు ఇదే పేరు మారు మ్రోగిపోతుంది . టాలీవుడ్ రెబల్ హీరో ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ అంచనాలతో నటించిన సినిమా . కేజిఎఫ్ లాంటి సూపర్ డూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రిలీజ్ కాబోతుంది . సలార్ పార్ట్ వన్ సిస్ ఫైర్ అనే పేరుతో డిసెంబర్ 22న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . అంతేకాదు బాహుబలి తర్వాత హిట్ రాకపోవడంతో ప్రభాస్ కూడా ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకొని ఉన్నారు . కాగా ఈ సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతుండడంతో .. సలార్ టికెట్స్ బుకింగ్ విషయంలో ఫ్యాన్స్ ముందుగానే జాగ్రత్తలు పడుతున్నారు . ఫ్యామిలీ ఫ్యామిలీకి టికెట్స్ బుక్ చేసుకుని చూసి ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నారు .

స్టార్ హీరోస్ కూడా అదే విధంగా చేస్తున్నారు. హైదరాబాదులోని శ్రీరాములు థియేటర్లో డిసెంబర్ 21 అర్ధరాత్రి ఒంటిగంటకు సలార్ షో పడుతుంది అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు . అంతేకాదు ఈ షో కోసం చాలామంది ముందుగా టికెట్స్ బుక్ చేసుకున్నారు . అయితే హీరో నిఖిల్ ఏకంగా 100 టికెట్లు బుక్ చేసుకుని షాక్ ఇచ్చాడు . ఆ 100 టికెట్లు కూడా ప్రభాస్ ఫాన్స్ కి ఫ్రీగా ఇవ్వబోతున్నారట . వారితో కలిసి నిఖిల్ కూడా సినిమా చూడబోతున్నారట . పదేళ్ల క్రితం అదే థియేటర్లో రాత్రి ఒంటిగంటకు రిలీజ్ అయిన మిర్చి సినిమా చూశాడట . ఇప్పుడు మళ్లీ అదే హిస్టరీ రిపీట్ కాబోతుంది అంటూ ట్విట్ చేశాడు. దీంతో నిఖిల్ కి ప్రభాస్ అంటే ఇంత పిచ్చి ప్రేమ నా..? గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు రెబల్ ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news