Moviesమెగా అభిమానుల మనసును తీవ్రంగా బాధపెట్టిన ఉపాసన..ఇలా చేస్తుంది అని కలలో...

మెగా అభిమానుల మనసును తీవ్రంగా బాధపెట్టిన ఉపాసన..ఇలా చేస్తుంది అని కలలో కూడా ఊహించలేదుగా..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాలు స్టార్ సెలబ్రెటీస్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన విషయం రాకపోతే చాలా డీలా పడిపోతున్నారు . అంతేకాదు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి వార్తను చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా మెగా కోడలు పిల్ల ఉపాసన చేసిన పోస్ట్ అభిమానులకు కూసింత డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది అంటున్నారు జనాలు .

రీసెంట్గా ఉపాసన క్లింకారకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే . పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత ఉపాసన రాంచరణ్ కు మొదటి సంతానం కలగడంతో ఫాన్స్ కూడా బాగా హ్యాపీగా ఫీలయ్యారు. అయితే ఉపాసన తన కూతురికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫేస్ మాత్రం రివిల్ కానివ్వకుండా జాగ్రత్త పడుతుంది. ఇలాంటి క్రమంలోనే ఉపాసన సోషల్ మీడియా ఖాతా ద్వారా “మోర్ బేబీస్ ఆన్ ద వే ” అంటూ ఓ పోస్ట్ చేసింది .

ఈ పోస్ట్ చూసిన మెగా అభిమానుల ఒక్కసారిగా సంతోష పడిపోయారు. ఉపాసన మళ్లీ ప్రెగ్నెంట్ అయిందా ..? రెండో బిడ్డకు జన్మనివ్వబోతుందా..? ఈసారి మెగా వారసుడు పక్క అంటూ కొన్ని సెకండ్స్ లోని వేయికోట్ల ఆశలను పెంచేసుకున్నారు మెగా అభిమానులు . అయితే తీరా మేటర్ తెలుసుకున్నాక ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు. తల్లి కాబోతుంది ఉపాసన కాదు తన చెల్లి అంటూ క్లారిటీకి వచ్చేసింది .

ఉపాసన చెల్లెలు రీసెంట్ గానే పెళ్లి చేసుకుంది. అంతేకాదు ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ దాల్చినట్లు తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చింది ఉపాసన . దీంతో తన చెల్లి బిడ్డకు జన్మనివ్వబోతుంది అనే విషయాన్ని ఉపాసన షేర్ చేయడంతో కొంతమంది హ్యాపీగానే ఫీలవుతున్న .. మరి కొంతమంది నువ్వు ప్రెగ్నెంట్ అనుకున్నాము ఉపాసన డిసప్పాయింట్ చేసావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఇలా అభిమానుల మనసులను పరోక్షంగా హర్ట్ చేసింది ఉపాసన..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news