Moviesఅబ్బబ్బా..అభిమానులకి ఎగిరి గంత్తెసే న్యూస్ చెప్పిన కళ్యాణ్ రామ్..ఇప్పుడు ఇండస్ట్రీలో అసలు...

అబ్బబ్బా..అభిమానులకి ఎగిరి గంత్తెసే న్యూస్ చెప్పిన కళ్యాణ్ రామ్..ఇప్పుడు ఇండస్ట్రీలో అసలు మజా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోగా పాపులారిటి సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన సినిమా “డెవిల్”. ఈ సినిమాలో మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది . పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . బింబిసారా తరువాత అలాంటి హిట్ కోసం చూస్తున్న కళ్యాణ్ రామ్ కి ఇది పర్ఫెక్ట్ మూవీ అని చెప్పాలి .

కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్గా “డెవిల్” సినిమాలో కనిపిస్తాడు . ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర బృందం . ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఎమోషనల్ అవుతారు . అంతేకాదు డేవిల్ 2 గురించి కూడా ఓపెన్ అప్ అయిపోయాడు . ఆయన మాట్లాడుతూ ..”డెవిల్ టు కచ్చితంగా ఉంటుంది . నా టీం మెంబర్స్ తోనే ఉంటుంది “.

“2024 లోనే డెవిల్ 2 షూటింగ్ పనులు కూడా మొదలు పెట్టాలనుకుంటున్నాం. ఖచ్చితంగా 2025 లో రిలీజ్ చేస్తాం అంటూ అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పాడు. 1940 ఎరా కనిపిస్తుందని ఖచ్చితంగా ఇది సినిమా ఇండస్ట్రీలో మంచి ట్రెండ్ సెట్ చేస్తుందని చెప్పుకొచ్చాడు . నందమూరి హీరో కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news