Newsఐటెం సాంగ్స్‌కు కూడా వేస్ట్‌... ప‌క్క‌న ప‌డేయండి... రెజీనాకు టాలీవుడ్‌లో ఘోర...

ఐటెం సాంగ్స్‌కు కూడా వేస్ట్‌… ప‌క్క‌న ప‌డేయండి… రెజీనాకు టాలీవుడ్‌లో ఘోర అవ‌మానం…!

రెజీనా కాసాండ్రా..మంచి కెరీర్ ని కాస్త మెగా హీరోలతో పెట్టుకొని పాడు చేసుకుందని కొందరు ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. తెలుగులో రెజీనా కాసాండ్రా నటించిన మొదటి సినిమా శివ మనసులో శృతి. ఈ సినిమాతో ఘట్టమేని కుటుంబం నుంచి సుధీర్ బాబు హీరోగా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినప్పటికీ హీరోహీరోయిన్లుగా పరిచయమైన సుధీర్ బాబు, రెజీనా కాసాండ్రాలకి మాత్రం మంచి పేరొచ్చింది.

ఆ తర్వాత ఇద్దరూ బాగా అవకాశాలు అందుకున్నారు. రెజీనా కాసాండ్రాకి రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట సినిమాలు మంచి పాపులారిటీని తెచ్చాయి. ఇక సాయి ధరం తేజ్ హీరోగా నటించిన పిల్లా నువ్వు లేని జీవితం సినిమా రెజీనాకి మంచి బ్రేక్ ఇచ్చింది. దాంతో వరుసగా రెజీనా కాసాండ్రా టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ వచ్చింది. ఒకదశలో మేకర్స్ కన్ను రెజీనా మీదే ఉండేది.

ఈ క్రమంలో రారా కృష్ణయ్య, పవర్, శంకర, సుబ్రమణ్యం ఫర్ సేల్, అ! లాంటి సినిమాలు చేసింది. అయితే, సాయి ధరం తేజ్ సరసన నటించిన సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా సమయంలో ఇద్దరు లవ్ లో ఉన్నారని టాలీవుడ్ లో ప్రచారం సాగింది. పెళ్లి కూడా చేసుకునే అవకాశాలున్నాయంటూ వార్తలు వచ్చాయి. ఏమైందో తెలీదు గానీ, ఒక్కసారిగా రెజీనా కాసాండ్రా కెరీర్ బాగా స్లో అయింది. హీరోయిన్ గా ఛాన్సులు తగ్గాయి.

మన ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు తగ్గినా ఒక్కోసారి ఐటెం సాంగ్స్ తో కెరీర్ మళ్ళీ ఊపందుకుంటుంది. ఆచార్య సినిమాలో రెజీనా ఐటెం సాంగ్ చూశాక అందరూ అదే అనుకున్నారు. కానీ, ఆచార్య డిజాస్టర్ వల్ల రెజీనా కాసాండ్రాని పక్కనపెట్టేశారు. ఈ అమ్మాయి ఐటెం సాంగ్స్ కి కూడా పనికిరాదని.. ఆమెకు ఛాన్స్ ఇచ్చినా వేస్ట్ అని టాలీవుడ్ జ‌నాలు అంటున్నారు.

చెప్పాలంటే ఆచార్య సినిమాలో బావుండే సాంగ్ రెజీనాదే. అయినా ఎందుకు తొక్కేశారో తెలియదు. శాకిని డాకిని సినిమా చేసినా పాపం రెజీనా కెరీర్ ఆగిపోయింది. ఎంత అందాలు ఆరబోసి ఫొటో షూట్స్ చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news