Moviesచిరంజీవి - జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్ ఎలా మిస్ అయ్యింది...!

చిరంజీవి – జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్ ఎలా మిస్ అయ్యింది…!

టాలీవుడ్‌లో ఇప్పుడు అంతా మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుంది. ఒకప్పుడు స్టార్ ఇమేజ్ ఉన్న ఇద్దరు హీరోలు కలిసి నటించేందుకు పెద్దగా ఇష్టపడేవారు కాదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు ఆ తరం హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చెప్పేవారు. 1990వ దశకం తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలు, అభిమానుల మధ్య గొడవలు జరుగుతాయన్న ఉద్దేశంతో అసలు మల్టీస్టారర్ సినిమాలలో నటించలేదు. అభిమానులు ఎక్కడ ఫీల్ అవుతారో అన్న డౌట్లు వాళ్లకు ఉండేవి. అయితే గత పది ఏళ్లలో టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తోంది.

ఈ విషయంలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌ను మెచ్చుకోవాలి. ఆయన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్, వరుణ్ తేజ్ లాంటి హీరోలతో మల్టీస్టారర్ సినిమాలలో నటించారు. అలాగే కమలహాసన్ తోను ఈనాడు సినిమాలో తెరపంచుకున్నారు. ఇక త్రిబుల్ ఆర్ సినిమాలో నందమూరి, కొణిదల కాంపౌండ్లకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. అది కూడా ఒక పాన్ ఇండియా సినిమాలో నటించడం పెద్ద సెన్సేషనల్ అయిందని చెప్పాలి. ఇక నాగార్జున కూడా మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఆసక్తితో ఉంటున్నారు.

అయితే 20 ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ సినిమా అనుకున్నారు. అప్పట్లో ఈ కాంబినేషన్ అంటే నిజంగా సెన్సేషనల్ అనుకోవాలి. నైజాంలో టాప్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉండే ————ఆవుల, గిరి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా సెట్ చేయాలని అనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. నైజాంలో గిరి అంటే ఒకప్పుడు టాప్ డిస్ట్రిబ్యూటర్. ఆయన స్టార్ హీరోలు నటించిన ఎన్నో సినిమాలు అక్కడ పంపిణీ చేశారు.

ఈ క్రమంలోనే చిరు , ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఒక సినిమా నిర్మించాలని అనుకున్నారు. కొన్ని కథలు కూడా విన్నారు. చాలామంది దర్శకులను పిలిపించే ప్రత్యేకంగా సిట్టింగులు కూడా వేశారు. అప్పట్లో ఎన్టీఆర్ ఆది, సింహాద్రి లాంటి సినిమాలతో తిరుగులేని మాస్ ఇమేజ్ తో దూసుకుపోయారు. అయితే వీరిద్దరి ఇమేజ్‌ల‌ను సమానంగా బ్యాలెన్స్ చేసే కథలు దొరకపోవడం.. కథలో దొరికితే.. వీరిని డైరెక్ట్ చేసే దర్శకుడు లేకపోవడంతో ఈ కాంబినేషన్ సెట్ కాలేదు. అయితే ఇనేళ్ళ‌ తర్వాత చిరూ తనయుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో త్రిబుల్ ఆర్ మల్టీస్టారర్ సినిమా రావటం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news