Newsఛార్మీ వ‌ల్ల పూరి జ‌గ‌న్నాథ్‌కు దూర‌మైన హాట్ హీరోయిన్‌...!

ఛార్మీ వ‌ల్ల పూరి జ‌గ‌న్నాథ్‌కు దూర‌మైన హాట్ హీరోయిన్‌…!

పూరి జగన్నాద్ టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌గా పాపులర్ అయ్యాడు. 100 కోట్లు పోగొట్టుకున్నా అదే కాంఫిడెన్స్. అదే జోష్ తో సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే, పూరి జగన్నాద్ ఏ సినిమా చేసిన హీరోలకి ఓ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసి పెడతాడు. అలాగే, హీరోయిన్స్ విషయంలోనూ. ఆయన సినిమాలో హీరోయిన్ కి ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది.

ఆయన కథ రాసుకున్నప్పుడు హీరోయిన్ పాత్రకి మంచి ఇంపార్టెన్స్ ఉండేలా చూస్తారు. దానివల్లే కొందరు హీరోయిన్స్ పూరి చలువ వల్ల ఇండస్ట్రీలో ఎక్కువ సంవత్సరాలు కొనసాగుతున్నారు. ఇక పూరి సినిమాలలో ఉండే ఐటెం సాంగ్స్ కూడా బాగా పాపులర్ అవుతాయి. ఆ సాంగ్స్ లో కనిపించిన అమ్మాయిలు క్రేజ్ తెచ్చుకుంటారు. వారిలో ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది నోరా ఫతేహి, మొమైత్ ఖాన్.

పూరి మొత్తం ఆస్తులన్నీ పోగొట్టుకొని డీలా పడిన సమయంలో తమ్ముడు సాయి రాం శంకర్ ని హీరోగా పరిచయం చేస్తూ 143 అనే సినిమాను చేశాడు. ఈ సినిమాలో ఉన్న ఐటెం సాంగ్ ద్వారా పాప్ సింగర్ కం డాన్సర్ మొమైత్ ఖాన్ టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ పాటలో మొమైత్ తన డ్రస్ ని తొడలపై వరకూ కత్తిరించుకుంది. ఐటెం సాంగ్ అంటే ఇలాగే ఉండాలని పూరికి చెప్పింది. అంత డెడికేషన్ ఉన్న మొమైత్ ఖాన్ పూరికి తెగ నచ్చేసింది. చాలా ఏళ్ళు కలిసి ఉన్నారు.

పూరి భార్య ఒక్కోసారి ముద్దలు కలిపి మొమైత్ నోట్లో పెట్టేదట. అంత క్లోజ్ గా ఉన్న పూరి, మొమైత్ ఖాన్ ఛార్మీ ఎంట్రీతో విడిపోయారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. కాస్త నిశితంగా గమనిస్తే ఈ విషయం మనకీ నిజమనిపిస్తుంది. ఇప్పుడు పూరితో కలిసి జర్నీ చేస్తుంది ఛార్మీనే. మొమైత్ ఖాన్ ఏమైందో పాపం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news