Newsబాల‌య్య‌ను ఏకంగా 8 మంది డైరెక్ట‌ర్లు రౌండ‌ప్ చేసేసారుగా.. లిస్ట్ ఇదే.....

బాల‌య్య‌ను ఏకంగా 8 మంది డైరెక్ట‌ర్లు రౌండ‌ప్ చేసేసారుగా.. లిస్ట్ ఇదే.. !

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. గత రెండేళ్లుగా ఈ హీరో వ‌రుస బ్లాక్ బాస్ట‌ర్ హిట్ల‌తో దూసుకు వెళుతున్నాడు. అటు వెండితెరతో పాటు.. ఇటు బుల్లితెరపై అన్ స్టాప‌బుల్‌ టాక్‌షో తో వీరంగం ఆడేస్తున్నాడు. బాలయ్య వెండితెరపై ఏకంగా అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేస‌రి సినిమాలతో హ్యాట్రిక్‌ హిట్లు అందుకున్నారు. బాలయ్య కెరీర్‌లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఇలా వరుసగా హ్యాట్రిక్ హిట్లు సొంతం అయ్యాయి. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వందకోట్ల కలెక్షన్లు అందుకుని కమర్షియల్‌గా బాలయ్య స్టామినా ఎంటో ప్రూవ్ చేశాయి.

ఈ ఏడాది ఏకంగా సంక్రాంతికి వీరసింహారెడ్డి, దసరాకు భగవంత్ కేస‌రి సినిమాలతో రెండు వరుస హిట్లు తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో బాలయ్య మార్కెట్ భారీగా పెరిగిపోయింది. అంతేకాదు స్టార్ హీరోలు, కమర్షియల్ డైరెక్టర్‌ల‌కి అందుబాటులో లేకపోవడంతో వాళ్ళందరికీ ఇప్పుడు బాలయ్య ఆప్షన్‌గా మారారు. బోయపాటి శ్రీను, బాబి, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, హరిష్‌ శంకర్, పూరి జగన్నాథ్, సంపత్ నంది, క్రిష్ ఇలా కమర్షియల్ డైరెక్టర్లు అందరూ కథ‌లు పట్టుకుని స్టార్ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోల చుట్టూ తిరుగుతున్నారు.

వారెవరు ఈ డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూప‌టం లేదు. పైన చెప్పిన ఎనిమిది మంది డైరెక్టర్లలో ఒకరిద్దరు మిన‌హా మిగిలిన వారికి సరైన హీరోలు లేరు. దీంతో ఇప్పుడు వీళ్లంతా బాలయ్య కోసం కథలు రెడీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే కథలు రెడీ చేసుకున్న వారంతా బాలయ్య చుట్టూ తిరుగుతున్నారు. పైన చెప్పుకున్న దర్శకులు ఎవరికీ స్టార్ హీరోలు అందుబాటులో ఉండటం లేదు. వీరితో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోలు సినిమాలు చేసే పరిస్థితులు లేవు.

దీంతో ఇప్పుడు వీరంతా బాల‌య్య‌ చుట్టూ చక్కెర్లు కొడుతున్నారు. రూ.100 కోట్ల బడ్జెట్లో సినిమాలు తీసినా.. బాలయ్యతో ఈజీగా వర్కౌట్ అవుతుంది.. అందుకే ఇప్పుడు ఈ డైరెక్టర్ల అందరి ఆప్ష‌న్‌ బాలయ్య కావటం విశేషం. ఇక బాలయ్య తీసుకునే రెమ్యూనరేషన్ కూడా రూ.25 నుంచి రూ.30 కోట్ల రేంజ్‌లో రీజన్‌బుల్‌గా ఉంటుంది. అందుకే ఇప్పుడు బాలయ్యతో సినిమా చేసి కచ్చితంగా హిట్టు కొట్టాలని వీళ్లంతా ఊవ్విళ్ళూరుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news