Moviesబాల‌కృష్ణ ' డిస్కోకింగ్ ' కు ఇంత స్పెషాలిటీ ఉందా.. కెరీర్‌లో...

బాల‌కృష్ణ ‘ డిస్కోకింగ్ ‘ కు ఇంత స్పెషాలిటీ ఉందా.. కెరీర్‌లో ఎప్ప‌ట‌కీ గుర్తుండిపోయే సినియా..!

నందమూరి బాలకృష్ణ తన సినిమా కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఇప్పటికే తన కెరీర్‌లో 108 సినిమాలు పూర్తి చేసుకున్న బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109వ సినిమాలో నటిస్తున్నారు. బాలయ్య ఇంటర్ చదువుతున్నప్పటి నుంచే సినిమాల్లోకి వచ్చేసారు. డిగ్రీ చదువుతున్న టైంలో కూడా తన తండ్రి దర్శకత్వంలో తన తండ్రితో కలిసి ఎన్నో సినిమాలలో నటించారు. ఆయన యుక్త వయసులోనే ఏకంగా 10 సినిమాలలో నటించేశారు.

బాలయ్య విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే పూర్తిస్థాయి హీరోగా సినీ రంగంలో ప్రవేశించారు. ఇలా తన విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వెంటనే నటించిన సినిమా డిస్కో కింగ్. ఇది బాలయ్య కెరీర్ లో 13వ సినిమా. యువనిర్మాత రాకేష్ కు బాలయ్య కాల్ షీట్లు ఇచ్చారు. హిందీలో ఘనవిజయం సాధించిన డిస్కో డాన్సర్ సినిమాను తెలుగులో డిస్కో కింగ్ పేరుతో రీమేక్ చేశారు. రచయిత గణేష్ పాత్రో అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేశారు.

హీరోయిన్‌గా తులసి ఎంపికయింది. తాతినేని ప్రసాద్ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. బాలకృష్ణ పూర్తిస్థాయి హీరోగా నటించిన తొలి సినిమా డిస్కో కింగ్. ఒక మామూలు కథే అయినా అదిరిపోయే సంగీతంతో ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రేమ, ఆస్తి అంతస్తులకు డిస్కోను జత చేయటమే ఈ సినిమా స్పెషాలిటీ. ఈ సినిమాకు సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కోవటంతో.. అభిమానులు, ప్రేక్షకులు చాలా కాలం పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. అనేక వాయిదాల‌ అనంతరం ఈ సినిమా 1984 జూన్ 7న రిలీజ్ అయింది. అయితే అభిమానుల అంచనాలు అందుకోలేదు.

బాలయ్య డిస్కో డాన్సర్ గా ఈ సినిమాలో నటించారు. తొలి సినిమా అయినా.. హీరోగా బాలకృష్ణ చక్కగా నటించారు. డ్యాన్సులు, యాక్షన్ స‌న్నివేశాలలో తనదైన ముద్రవేశారు. హీరోయిన్‌గా తులసి ఆకట్టుకుంటుంది. పట్టిందల్లా బంగారమే పాట ఈ సినిమాలో హైలెట్ అయింది. 56 కేంద్రాలలో విడుదలైన ఈ సినిమా తొలివారం రూ.33 లక్షల వసూళ్లు కొల్లగొట్టింది. అలాగే ఈ సినిమాలో లీనాదాస్ కూడా కనిపిస్తారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news