Moviesబాల‌య్య - బాబి సినిమా కోసం సెంటిమెంట్‌గా ఆ హీరోయిన్ ...!

బాల‌య్య – బాబి సినిమా కోసం సెంటిమెంట్‌గా ఆ హీరోయిన్ …!

వరుస హిట్లతో తన కెరీర్ లోనే ఫుల్ ఫామ్ లో ఉన్నాడు నందమూరి నట‌సింహం బాలకృష్ణ. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేస‌రి సినిమాలు బాలయ్య అభిమానులనే కాదు.. సగటు సినీ ప్రేక్షకులను కూడా అలరించాయి. అందులోను ఈ యేడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి, దసరాకు భగవంత్‌ కేసరి సినిమాలతో ప్రేక్షకులకు ముందుకు వచ్చి.. దుమ్ము దులిపేశాడు. ఇప్పుడు అందరి దృష్టి బాలయ్య – బాబి కాంబినేషన్లో తెర‌కెక్కుతున్న సినిమా మీద ఉంది. పైగా చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్‌బాస్టర్ హిట్ ఇచ్చాక.. బాబి ఇప్పుడు బాలయ్యతో.. అందులోనూ ఫుల్ మాసివ్ రోల్‌లో చూపించే ప్రయత్నంలో ఉన్నాడు.

ఈ సినిమాని బాలయ్య అభిమానులకు ఓ ట్రీట్‌లా ఇవ్వాలని బాబీ ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఈ సినిమా కోసం బాబి చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు. ఇప్పటికే సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఊర్వశి రౌతేలాతో ఆల్రెడీ షూటింగ్ జరుగుతోంది. గుంటూరు కారం హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా మరో హీరోయిన్‌గా ఖరారు అయింది. ఇక మూడో హీరోయిన్ ఎవరు ? అన్నది తేలాల్సి ఉంది. మూడో హీరోయిన్ పాత్ర కోసం ముదురు ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో తమన్నా ఓ ఐటెం సాంగ్ లో చేస్తుందని తెలుస్తోంది. బాలయ్య – తమన్నా కాంబినేషన్ ఇప్పటివరకు సెట్ కాలేదు. ఈ సినిమాతో ఈ జోడిని తెరమీద చూసే అవకాశం దక్కబోతుంది. తమన్నా ఐటమ్ గీతాల స్పెషలిస్ట్. ఆమె ఐటమ్ సాంగ్ చేసింది అంటే.. సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఈ ఏడాది రజనీకాంత్ జైలర్ సినిమాలో ఆమె ఐటెం సాంగ్ బాంబులా పేలింది. గతంలోనూ ఆమె ఐటమ్ సాంగ్‌లు అదిరిపోయాయి. ఇప్పుడు ఆ సెంటిమెంట్ కోసమే బాబి.. తమన్నాతో బాలయ్య సినిమాలో ఐటెం సాంగ్ చేయిస్తున్నట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news