Moviesయానిమల్ మూవీ రివ్యూ: అర్జున్ రెడ్డి కి అమ్మ మొగుడు లాంటి...

యానిమల్ మూవీ రివ్యూ: అర్జున్ రెడ్డి కి అమ్మ మొగుడు లాంటి సినిమా ఇది.. 1000 కోట్లు పక్క..రాసిపెట్టుకోండి..!!

కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన యానిమల్ మూవీ ఎట్టకేలకు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది . మొదటి నుంచే భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తుంది . మొదటి షో తోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా టాక్ నమోదు చేసుకుంది . సినిమాలో ఎలాంటి వైలెన్స్ ఎక్స్పెక్ట్ చేసామో అంతకు ట్రిపుల్ రేంజ్ లో వైలెన్స్ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి వంగ .

అంతేకాదు సినిమాలో చాలా చాలా బోల్డ్ సీన్స్ లో రష్మిక -రణ బీర్ రెచ్చిపోయి నటించడం సినిమాకి మరింత ప్లస్ గా మారింది . తెరపై ఫాదర్ – సన్ సెంటిమెంట్ చూపిస్తూనే భార్యాభర్తల బంధాన్ని క్లియర్ గా కళ్ళకు కట్టినట్లు వివరించాడు సందీప్ రెడ్డివంగా . అప్పటివరకు చాక్లెట్ బాయ్ పాత్రలో కనిపించిన రణ బీర్.. ఒక్కసారిగా వైలెంట్ పాత్రలో కనిపించడంతో అభిమానుల సైతం ఈ సినిమాను బాగా లైక్ చేస్తున్నారు .

ఒకటి కాదు రెండు కాదు సినిమాలో మొత్తం కావాల్సిన మసాలాలు దాటించి సినిమాను ఓ రేంజ్ లో తెరకెక్కించారు . ఎక్కడ కూడా ఇది నెగటివ్ అని చెప్పడానికి లేకుండా తెరకెక్కించాడు. దీంతో సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది . అంతేకాదు అర్జున్ రెడ్డికి మించిపోయేలాంటి సినిమా ఇది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో యానిమల్ మూవీ రివ్యూ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news