Newsచిరు ' విశ్వంభ‌ర ' పై మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌... అస్స‌లు...

చిరు ‘ విశ్వంభ‌ర ‘ పై మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌… అస్స‌లు ఊహించ‌లేం…!

టాలీవుడ్ లెజెండ్రీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న చిరంజీవి 150 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కుతున్నఈ సినిమా సోషియా ఫాంట‌సి కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతుంది. అప్పుడెప్పుడో చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాను థియేటర్లలో చూస్తున్న టైం లోనే చిరంజీవితో ఇలాంటి కథతో ఒక సినిమా తీయాలని అనుకున్న వశిష్ఠ కోరిక ఎట్టకేలకు ఇప్పుడు తీరబోతుంది.

ఈ సినిమా గురించి ఒక్కో ఇంటరెస్టింగ్ అప్డేట్ బయటకు వస్తుంది. చిరుకు జోడిగా మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఉంటారని అందులో అనుష్క కూడా కీలకపాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు ఛాయా గ్రహణం అందిస్తుండగా.. తాజాగా ఈ సినిమాపై ఆయన ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు చెప్పేశారు. మెగాస్టార్ గారు ఈ సినిమాలో ది బెస్ట్ గా ఉంటారని.. ఛోటా కాన్ఫిడెంట్గా చెప్పారు.

ఇప్పటికే ఓ షెడ్యూల్ ఆల్రెడీ కంప్లీట్ చేశామని కూడా ఆయన చెప్పారు. అంటే ఈ సినిమా షూటింగ్ సైలెంట్‌గా చక చక జరుగుతోందని తెలుస్తోంది. ఛోటా కె నాయుడు ఈ విషయం చెప్పడంతో మెగా అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. చిరంజీవి సినిమా షూటింగ్ ఇంత స్పీడ్‌గా జరుగుతుందా ? అని ఆశ్చర్యపోతున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాకు ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది లేదా 2025 సంక్రాంతి కానుక‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news