Newsమ‌హేష్ నెక్ట్స్ 4 సినిమాల డైరెక్ట‌ర్ల లిస్ట్ ఇదే... మామూలు కాంబినేష‌న్లు...

మ‌హేష్ నెక్ట్స్ 4 సినిమాల డైరెక్ట‌ర్ల లిస్ట్ ఇదే… మామూలు కాంబినేష‌న్లు కాదుగా…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్ర‌స్తుతం మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో గుంటూరు కారం సినిమా తెర‌కెక్కుతోంది. స‌ర్కారు వారి పాట సినిమా త‌ర్వాత మ‌హేష్ లాంగ్ గ్యాప్ తీసుకుని చేస్తోన్న సినిమా ఇది. అలాగే త్రివిక్ర‌మ్ – మ‌హేష్‌బాబు కాంబినేష‌న్లో 13 ఏళ్ల త‌ర్వాత గుంటూరు కారం సినిమా వ‌స్తోంది. ఇక ఈ సినిమా సంక్రాంతి రేసులో బ‌రిలో ఉండ‌డంతో అంచ‌నాలు మామూలుగా లేవు.

కేవ‌లం తెలుగులో మాత్ర‌మే రిలీజ్ అవుతోన్న గుంటూరు కారంకు ఇక్క‌డ మాత్ర‌మే రు. 130 కోట్ల రేంజ్‌లో ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోంది. ఇక గుంటూరు కారం త‌ర్వాత ఎన్నో ఏళ్ల నుంచి అంద‌రూ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తోన్న మ‌హేష్‌బాబు – రాజ‌మౌళి సినిమా సెట్స్ మీద‌కు వెళుతుంది. ఈ సినిమా కోసం మ‌హేష్ ఏకంగా రెండేళ్ల పాటు టైం కేటాయించాల్సి ఉంటుంది. ఇది మ‌హేష్ కెరీర్‌లో 29వ సినిమాగా తెర‌కెక్క‌నుంది.

మ‌హేష్ – రాజ‌మౌళి సినిమా త‌ర్వాత సందీప్ రెడ్డి వంగ – మ‌హేష్ సినిమా ఉండ‌నుంది. సందీప్‌రెడ్డి వంగా ప్ర‌స్తుతం ర‌ణ‌బీర్ క‌పూర్ – ర‌ష్మిక కాంబినేష‌న్లో యానిమల్ సినిమా తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్‌తో స్పిరిట్ ఉంటుంది. ఆ వెంట‌నే మ‌హేష్ సినిమా కోసం క‌థ రెడీ చేసే ప‌నిలో ఉంటాడు. సందీప్ రెడ్డి వంగా త‌ర్వాత మ‌హేష్‌బాబు – అనిల్ రావిపూడి సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది.

అనిల్ మ‌హేష్‌తో స‌రిలేరు నీకెవ్వ‌రు చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు మ‌రోసారి మ‌హేష్ కూడా అనిల్‌తో సినిమా చేసేందుకు ఆస‌క్తిగా ఉన్నాడు. రాజ‌మౌళి, సందీప్ సినిమాల త‌ర్వాత ఖ‌చ్చితంగా వీరిద్ద‌రి కాంబోలో సినిమా ఉండ‌నుంది. ఏదేమైనా మ‌హేష్ కాంబినేష‌న్ అయితే చాలా స్ట్రాంగ్‌గా క‌నిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news