Movies"ఆ రోజు భూమిక చేసిన పనికి..కత్తి తో పొడ్చి చంపేయాలి అనుకున్న".....

“ఆ రోజు భూమిక చేసిన పనికి..కత్తి తో పొడ్చి చంపేయాలి అనుకున్న”.. హీరో శ్రీరామ్ కి అంత కోపం ఎందుకు వచ్చింది..?

శ్రీరామ్ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని ఇంపార్టెంట్ పాత్రలు పోషించి జనాలలో తనకంటూ ఓ స్దాన్నాని ఏర్పరచుకున్నారు . అయితే ఈయన ఒరిజినల్ పేరు శ్రీకాంత్ . అప్పటికే ఇండస్ట్రీలో శ్రీకాంత్ అనే పేరుతో కొందరు ఉండడంతో ఈయన శ్రీరామ తన పేరును మార్చుకున్నారు. ఇండస్ట్రీలోకి రావడానికి చాలా కష్టపడ్డాడు ..అవకాశాలు దక్కించుకోవడానికి ఇంకా ఇంకా కష్టపడ్డాడు .. వచ్చిన అవకాశాలను హిట్టుగా మార్చుకోవడానికి మరింతగా కష్టపడ్డారు. అంత కష్టపడినా సరే ఈయన కెరియర్ అంత ఆశాజనికంగా లేదు.

రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీ రామ్ తన వ్యక్తిగత జీవితం గురించి అలాగే సినిమా ఇండస్ట్రీలో తాను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి బయట పెట్టాడు. ” ఒకరికి ఒకరు , అమ్మానాన్న ఓ తమిళ్ అమ్మాయి.. రెండు సినిమాలకు ఒకేసారి సైన్ చేశాను ..రెండు సినిమాలు నా లైఫ్ని మార్చేశాయని.. బాగా ఫిక్స్ అయిపోయాను. కానీ అనుకొని సంఘటనల కారణంగా నేను ఆసుపత్రి పాలు అవ్వాల్సి వచ్చింది .. ఫైట్స్ చేయడానికి డాక్టర్స్ ఒప్పుకోలేదు .. నాకోసం అలాంటి సన్నివేశాలు తీసేయండి అని డైరెక్టర్ని కోరడం తప్పు అనిపించింది .. అందుకే ఆ సినిమా నుండి బయటకు వచ్చేసాను అంటూ ఎమోషనల్ గా స్పందించారు “.

అంతేకాదు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న భూమిక గురించి ఫుల్ ఫైర్ అయిపోయారు .”ఓ సినిమా షూట్ లో సగం పాట అయిపోయాక సెట్ నుంచి పారిపోయింది అని.. ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడ్డామని ఒక రోజు ఎయిర్ పోర్ట్ లో కనిపించినప్పుడు .. ఆ సాంగ్ షూటింగ్ ఎలా జరిగింది అంటూ క్వశ్చన్ చేసిందని.. అప్పుడున్న నా పొజిషన్ కి కత్తి తీసుకొని అక్కడే పొడిచేద్దాం ..అన్నంత కోపం వచ్చిందని “ఆయన చెప్పుకొచ్చాడు. అయితే మళ్లీ స్పందిస్తూ “మళ్ళీ మేము ఈ మధ్యకాలంలోనే మాట్లాడుకున్నామని.. సరదా సరదాగా సాగిపోయింది అని.. కానీ ఒకప్పుడు మాట్లాడుకున్న మాటలు ఇప్పుడు తలుచుకొని నవ్వుకున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఆరోజు నిజంగానే నా చేతిలో కత్తి ఉంటే పొడి చేసే వాడినేమో అంటూ కూడా చెప్పుకొచ్చాడు”.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news