Newsఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్: అభిమానులకి నాగ శౌర్య బిగ్ గుడ్...

ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్: అభిమానులకి నాగ శౌర్య బిగ్ గుడ్ న్యూస్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నాగశౌర్య .. రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నిన్నటికి ఈయన పెళ్లి చేసుకొని ఏకంగా సంవత్సరం దాటింది . నవంబర్ 20..2022లో ఈయన వివాహం చేసుకున్నారు . బెంగళూరులో చాలా తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఈయన తాను ప్రేమించిన అమ్మాయి అనూషను పెళ్లి చేసుకున్నారు .

వీళ్ళ పెళ్ళై ఒక సంవత్సరం కంప్లీట్ అయిన శుభసందర్భంగా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీను చాలా సింపుల్ గా తమ ఇంట్లో చిన్న కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . అయితే పెళ్లి తర్వాత అనూష – నాగశౌర్య ఎక్కడ జంటగా కనిపించకపోవడంతో ఈ జంట మధ్య విభేదాలు వచ్చాయని దూరం దూరంగా ఉంటున్నారు అంటూ తెగ ట్రోల్ చేశారు కొంతమంది జనాలు .

అయితే నాగశౌర్య దానిపై ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు కానీ ఈ చిన్న వీడియోతో వాళ్లకు మూతి మీద కొట్టే ఆన్సర్ ఇచ్చాడు . మేము విడిపోలేదు కలిసే ఉన్నాము అంటూ వాళ్లకు ఫుల్ కోటింగ్ ఇచ్చేశారు. దీంతో నాగశౌర్య అనుష జంటకు స్పెషల్ విషెస్ అందిస్తున్నారు అభిమానులు. ఈ విధంగా పరోక్షంగా ఫాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించేసాడు నాగశౌర్య..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news