Newsప‌వ‌న్ ఫేవ‌రెట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ రమణ గోగులని ఇండస్ట్రీ కావాలనే తొక్కేసిందా..?

ప‌వ‌న్ ఫేవ‌రెట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ రమణ గోగులని ఇండస్ట్రీ కావాలనే తొక్కేసిందా..?

రమణ గోగుల తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంగీతం అందించిన అతికొద్దిమందిలో ఒకరు. సంగీత దర్శకుడుగా, గాయకుడుగా, పాటల రచయితగా, పాప్ సింగర్ గా ప్రపంచ స్థాయిలో పాపులర్ అయ్యారు. 1996 లో రమణ గోగుల తన తీం తో కలిసి మిస్టి రిథమ్స్ ఇండీ పాప్‌ స్టూడియో ఆల్బమ్ “అయే లైలా” తో పాటు, మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు. ఇది భారతదేశంలోని ఎం టీవీ, ఛానల్ వి లాంటి మ్యూజికల్ బేస్డ్ ఛానెళ్లలో బ్లాస్ట్ అయింది.

దాంతో తెలుగు సినిమాలకి సంగీతం అందించే అవకాశం అందుకున్నారు. 3 దక్షిణ భారత భాషలలో దాదాపు 25 సినిమాలకు సంగీతం అందించారు. ప్రేమంటే ఇదేరా తెలుగులో సంగీత దర్శకుడిగా ఆయన మొదటి సినిమా. ఈ సినిమా పెద్ద మ్యూజికల్ హిట్ కావడంతో ఆ తర్వాత తమ్ముడు, బద్రి, యువరాజు లాంటి సినిమాలు చేసే ఛాన్స్ వచ్చింది.

బోణి సినిమాతో నిర్మాతగానూ మారాడు. అప్పటికే మ్యూజిక్ డైరెక్టర్‌గా రమణ గోగుల డౌన్ ఫాల్‌లో ఉన్నారు. అలాంటి సమయంలో బోణి సినిమాను నిర్మించడం పెద్ద రిస్క్ అని సన్నిహితులు ఇండస్ట్రీ వారు రమణ గోగులకి సలహాలిచ్చారు. కానీ, ఆయన వినకుండా సుమంత్, కృతీ కర్భంధ జంటగా బోణి చిత్రాన్ని నిర్మించారు. అసలే సుమంత్ అంటే పెదవి విరిస్తున్న సమయం. అలాంటిది బాగానే బడ్జెట్ పెట్టి సినిమా నిర్మించడం సాహసం. కానీ, కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు.

ఫైనల్ రన్ లో బోణి సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఫైనాన్షియల్‌గా దెబ్బతిన్నారు. దానికి తోడు పాటల్లో ఆయన గొంతు బాగున్నా, మధ్యలో వచ్చే అరుపులు కేకలు బాగోలేదని ఫిల్మ్ ఛాంబర్ నుంచి సూచనలు అందాయి. అయినా ఆయన పంథా మార్చుకోకపోవడంతో ఇండస్ట్రీనే పక్కన పెట్టినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. సంగీత దర్శకుడిగా ఆయన చివరి సినిమా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్. ఈ సినిమాకి ఆయన సంగీత దర్శకుడంటే ఎవరూ నమ్మలేరు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news