Newsస‌మంతే నాకు కావాలంటోన్న త‌మిళ స్టార్ హీరో... ఇదెక్క‌డి చిత్రం రా...

స‌మంతే నాకు కావాలంటోన్న త‌మిళ స్టార్ హీరో… ఇదెక్క‌డి చిత్రం రా బాబు..!

ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఎలాంటి లక్ష్యాలు అయిన చేరుకోవచ్చని నానుడి.. నటి సమంతకు సరిగ్గా సరిపోతుంది. హీరోయిన్గా ఈ చెన్నై భామ పయనం పూలబాట కాదు. కెరీర్ ప్రారంభంలోనే ఆశలు అడియాశ‌ల.. లక్ష్యంగా సమంత సినీ జీవితం సాగింది. తమిళ సినిమాలలో సాదాసీదాగా సాగిన సమంత నట జీవితం తెలుగు సినిమా పరిశ్రమ ఒక్కసారిగా మార్చేసింది. తెలుగులో తొలి సినిమా ఏ మాయ చేసావే సూపర్ హిట్ అయ్యి సమంత క్రేజీ అమాంతం పెంచేసింది.

ఆ తర్వాత వరుసగా బృందావనం, దూకుడు లాంటి సినిమాలు ఆమెను తిరుగులేని స్టార్ హీరోయిన్గా నిలబెట్టాయి. విచిత్రంగా తన తొలి సినిమా హీరో నాగచైతన్యతో వరసపెట్టి సినిమాలు చేస్తూ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఇదంతా ఆమె లైఫ్ లో స్పీడ్ గా జరిగిపోయింది. అంతా సంతోషం అయితే జీవితం ఎలా ?ఉంటుంది. ఆ తర్వాత తాను ఎంతో గొప్పగా ప్రేమించిన నాగచైతన్యతో మనస్పర్ధలు, విడిపోవడం వంటివి ఆమె కెరీర్ పరంగా పెద్ద కుదుపుకి కారణమయ్యాయి.

ఆ చేదు అనుభవాలు మరిచిపోకముందే ఆమె మయోసైటిస్ అనే వ్యాధికి గురైంది. ఆ వ్యాధి నుంచి బయటపడేందుకు ఎంతో పోరాటం చేసింది. ఈ పోరాటంలో ఆమె చాలా వరకు సక్సెస్ అయ్యారు. తాజాగా సమంత నేను మళ్ళీ రెడీ అంటూ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే సమంత కొద్ది నెలలపాటు తను సినిమాలకు గ్యాప్ తీసుకుంటానని ఇప్పటికే ప్రకటించారు. అయితే మయోసైటీస్ నుంచి అనుకున్న దానికంటే చాలా వేగంగా ఆమె కోలుకున్నారు.

దీంతో ఆమె తిరిగి సినిమాలలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తమిళ స్టార్ హీరో కార్తీ ఎలాగైనా సమంతతో ఒక్క సినిమాలో నటించాలన్న కోరుతూ ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి కార్తీ గత మూడేళ్ల నుంచి తన సినిమాలో సమంత హీరోయిన్‌గా పెట్టుకోవాలని విపరీతంగా ట్రై చేస్తున్నాడట.

ముందు సమంత కాస్త బిజీగా ఉండటం.. ఆ తర్వాత కరోనా.. ఇప్పుడు సమంత సినిమాలకు గ్యాప్ ఇవ్వడంతో కార్తీ కోరిక తీరలేదు. అయితే ఇప్పుడు సమంత తిరిగి సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడంతో కార్తీ తన కొత్త సినిమాలో ఆమెను హీరోయిన్గా పెట్టుకునేందుకు దర్శక నిర్మాతల ద్వారా తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి కార్తీ కోరిక సమంత తీరుస్తుందో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news