Newsమెగాస్టార్ - సూప‌ర్‌స్టార్ మ‌ల్టీస్టార‌ర్‌... డైరెక్ట‌ర్ కూడా ఫిక్స్‌..!

మెగాస్టార్ – సూప‌ర్‌స్టార్ మ‌ల్టీస్టార‌ర్‌… డైరెక్ట‌ర్ కూడా ఫిక్స్‌..!

కొన్నాళ్ల క్రిందట మెగాస్టార్ చిరంజీవి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో మల్టీ స్టార‌ర్ సినిమా తీస్తానని గొప్పగా ప్రకటించారు. పొలిటీషియన్ సీనియర్ నిర్మాత సుబ్బరామిరెడ్డి. అయితే అప్పుడు మెగా అభిమానులతో పాటు టాలీవుడ్ సినీ అభిమానులు అందరూ ఎంతో ఆనందపడ్డారు. అయితే అది ప్రకటనకే పరిమితమైంది. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో మల్టీ స్టార‌ర్ ప్రకటన రాలేదు. మళ్లీ ఈ నెలకు మరో క్రేజీ మల్టీస్టారర్ తెర మీదకు వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోలుగా సినిమా తీస్తానంటున్నాడు ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్. దర్శకుడుగా లారెన్స్ కు ఒక స్టైల్ ఉంది. ఆల్రెడీ నాగార్జున్ లాంటి సీనియర్ హీరోను డైరెక్ట్ చేసిన అనుభవం కూడా ఉంది. లారెన్స్ కు నాగార్జున మాస్ సినిమాతో ఛాన్స్ ఇస్తే.. సూపర్ డూపర్ హిట్ సినిమా తీసి నాగార్జునకు ఇచ్చాడు. ఆ తర్వాత మరోసారి నాగార్జునతో డాన్ సినిమా కూడా తీసి హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత కాంచన సీరిస్‌ సినిమాలతో దేశవ్యాప్తంగా సూపర్ పాపులర్ అయిపోయాడు.

నాగార్జున డైరెక్ట్ చేసిన అనుభవంతోనే ఇప్పుడు చిరంజీవి, రజనీకాంత్ ను పెట్టి మరో భారీ మల్టీస్టారర్ సినిమా చేస్తానంటున్నాడు. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్లో మల్టీస్టారర్ కోసం తన దగ్గర స్టోరీ కూడా రెడీగా ఉందని ప్రకటించి ఏకంగా లారెన్స్ మాట్లాడాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మల్టీ స్టార‌ర్ తీయడం పెద్ద కష్టం కాదు. చాలామంది హీరోలు కూడా మల్టీస్టార‌ర్‌ సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నారు.

చిరంజీవి చేసిన వాల్తేరు విరయ్య‌ సినిమా కూడా మల్టీస్టారర్ సినిమానే. ఎటు వచ్చి ఈ విషయంలో రజనీకాంత్‌ను ఒప్పించడం కష్టమైన పని అని చెప్పాలి. అయితే ఇప్పుడు పరిస్థితులు గట్టిగా మారాయి. లారెన్స్ రంగంలోకి దిగితే ఇటు చిరంజీవి, అటు రజినీకాంత్‌ల‌ను ఒప్పించడం పెద్ద పని కాదు. నిజంగా ఇద్దరు కాంబినేషన్లో సినిమా వస్తే ఇండియన్స్ సినిమా స్క్రీన్ మీద అదిరిపోయే సినిమా అవుతుందటంలో సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news