Moviesగుంటూరు 'దమ్ మసాలా': తూ..ఛీ..ఇది అసలు పాటేనా..? మహేశ్ ఫ్యాన్స్ ని...

గుంటూరు ‘దమ్ మసాలా’: తూ..ఛీ..ఇది అసలు పాటేనా..? మహేశ్ ఫ్యాన్స్ ని డీప్ గా హర్ట్ చేసిన ధమన్(Video)..!?

ఏంటో ఈ మధ్యకాలంలో మ్యూజిక్ డైరెక్టర్ ధమన్ టైం అసలు బాగోలేదనిపిస్తుంది. మొన్నటికి మొన్న ఓ పెద్ద డైరెక్టర్ అసలు ధమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ లానే లేడు అని.. ఆయన మ్యూజిక్ చేస్తే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని.. ఇంకా డీప్ గా చెప్పాలంటే అసలు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గానే పనికిరాడు అనే విధంగా పరోక్షకంగా కామెంట్స్ చేశారు. అంతే కాదు పలువురు జనాలు సైతం కొందరు హీరోల సినిమాలకు తప్పిస్తే మిగతా అందరి హీరోల సినిమాలకు శవం ముందు డప్పు కొట్టుకునేవాడిలా మ్యూజిక్ చేస్తున్నాడు అంటూ ట్రోల్ చేశారు.

మళ్లీ అదే విధమైన ట్రోల్స్ ప్రారంభమయ్యాయి . రీసెంట్గా త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాకి సంబంధించి ఫస్ట్ సాంగ్ “దమ్ మసాలా” రిలీజ్ అయింది . ఈ సినిమా నుంచి ఫస్ట్ పాట కోసం కోట్లాదిమంది అభిమానులు ఎన్ని నెలలుగా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫైనల్లీ ఎట్టకేలకు పాట రిలీజ్ అయిందన్న ఆనందంలో ఓపెన్ చేసి చూస్తే ఫ్యాన్స్ కలల్లో నీళ్ళు తెప్పించేశాడు ధమన్.

లిరిక్స్ అధ్బుతంగా ఉండగా పాటలోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే అచ్చం శవాలమందు డప్పు కొట్టే మ్యూజిక్ లానే ఉంది . దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమన్ పై మండిపడుతున్నారు . అసలు అది పాటనే నా..? పాటకు పట్టిన పీడనా..? అసలు ఈ పాటను నువ్వు కంపోజ్ చేసావా..? తమన్ అంటూ ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు . అంతేకాదు రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ ఎంత బాగున్నాయో నువ్వు కొట్టిన మ్యూజిక్ బీట్ అంత దరిద్రంగా ఉన్నాయని ..ఆయన ఎంతో చక్కగా రియలిస్టిక్ గా లిరిక్స్ రాస్తే .. నువ్వేమో నిద్రమత్తులో డప్పు కొట్టినట్టు కొట్టుకుంటూ పోయావని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

అంతేకాదు అసలు నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి ..? తాళం ఏంటి..? రిధమ్ ఏంటి..? అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతున్నారు . ఏదో ఊహించుకొని సాంగ్ రిలీజ్ చేస్తే మరేదోలా రియాక్ట్ అయిపోతున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ . ఈ సినిమా హిట్ అవ్వాలి అని మహేష్ త్రివిక్రమ్ ఎంతో కష్టపడుతుంటే .. తమన్ మాత్రం అసలు చీమకుట్టినట్లు కూడా లేకుండా నిద్రమత్తులో మ్యూజిక్ ఇచ్చినట్లు ఉన్నాడు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో తమన్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు. మరి గుంటూరు కారం సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ “దమ్ మసాలా” పాటపై మీ ఒపీనియన్ ఏంటి..? మీకు నచ్చిందా..? ఈ పాట నిజంగానే మీకు పూనకాలు తెప్పిస్తుందా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news