Videos' నీతా అంబానీ ' కొత్త కారు రేటు చూస్తే నోట్లో...

‘ నీతా అంబానీ ‘ కొత్త కారు రేటు చూస్తే నోట్లో మాట రాదంతే.. స్పీడ్ తెలిస్తే గింగ‌రాలే..!

భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లను ఉపయోగించే సంపన్న కుటుంబాలలో ముకేశ్ అంబానీ కుటుంబం ఒకటి. రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఫెరారీ వంటి ఎక్సపెన్సివ్ కార్లను కలిగి ఉన్న ఈ కుటుంబం తాజాగా మరో కాస్ట్‌లీ కారు తమ గ్యారేజీలో చేర్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మీరు ఈ క్రింది వీడియోలో గమనించినట్లయితే రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన క‌ల్లిన‌న్ బ్లాక్‌బ్యాడ్జ్ కారు ముంబై రోడ్లపై Z+ సెక్యూరిటీ కాన్వయలో వెళ్ళటం చూడవచ్చు. దీనిని ముఖేష్ అంబానీ భార్య నేత అంబానీ ఇటీవల కొనుగోలు చేశారు. దీని ధర రూ.10 కోట్లు ( ఆన్ రోడ్డు ) వరకు ఉంటుందని సమాచారం. గోల్డ్ షెడ్ లో కనిపించే ఈ కారు సాధారణ కార్ల కంటే చాలా ఆకర్షణయంగా ఉంటుందని తెలుస్తోంది.

6.75 లెటర్ ట్విన్ టర్బో వి12 పెట్రోల్ ఇంజన్ కల్లిన‌న్ 5000 ఆర్పిఎం వద్ద 563 బీహెచ్పీ పవర్, 1600 ఆర్పిఎం, 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు గరిష్ట వేగం ఏకంగా గంటకు 250 కిలోమీటర్లు. అంటే ఇది ఏ రేంజ్ స్పీడ్‌తో వెళుతుందో తెలుస్తోంది.

ఈ కారు సంప‌న్నుల‌కు మంచి టేస్ట్ ఉన్న వారికి బెస్ట్ చాయిస్‌గా నిలుస్తుంది. ఈ కారులో కొన్ని భాగాలు కార్బ‌న్ ఫైబ‌ర్‌తో ఉంటాయి. ఇలాంటి కారు బాలీవుడ్ బాద్ షా షారుక్‌ఖాన్ ఇప్ప‌టికే కొనుగోలు చేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news