Moviesఓ మై గాడ్: అలాంటి సర్జరీ చేయించుకోబోతున్న అనుష్క..? ఫ్యాన్స్ ఫుల్...

ఓ మై గాడ్: అలాంటి సర్జరీ చేయించుకోబోతున్న అనుష్క..? ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ ..!

వాట్ .. హీరోయిన్ అనుష్క శెట్టి సర్జరీ చేయించుకోబోతుందా? ఏమైంది? ఎందుకని సర్జరీ చేయించుకుంటుంది..? అసలు ఆమెకు ఏం బాగోలేదు ఇలాంటి కామెంట్స్ తోనే ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రంబోలా చేసేస్తున్నారు అనుష్క శెట్టి ఫాన్స్. చాలా చక్కగా చాలా హెల్తీగా ఉండే అనుష్కకు ఏం బాగోలేదు ..? ఏ కారణంగా ఆమె ఆపరేషన్ చేయించుకుంటుంది అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి .

కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ప్రకారం అనుష్క శెట్టికి మోకాళ్లలో చిన్న ప్రాబ్లం వచ్చిందట . ఈ కారణంగానే ఆమె మైనర్ సర్జరీకి వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది. ఫారిన్ కంట్రీస్ లో ఆమె తన మోకాళ్ళకి సర్జరీ చేయించుకోబోతుందట . ఆ కారణంగానే రీసెంట్గా కమిట్ అయిన సినిమా లు అన్నిటినీ హోల్డ్ లో పెట్టిందట. డాక్టర్ సజెషన్స్ మేరకు ఒక ఆరు నెలలు తెరపై కనిపించడానికి కూడా ఆమె ఇష్టపడడం లేదట .

అందుకే కమిట్ అయిన సినిమాల నుంచి తీసుకున్న అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసి .. మరి ఆ సినిమాల నుంచి తప్పుకోవడానికి సిద్ధపడుతుందట అనుష్క . ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దీనిపై అనుష్క ఎంత త్వరగా స్పందిస్తే అంత బాగుంటుంది అంటూ కూడా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news