Moviesఅమ్మ బాబోయ్..మన నేషనల్ క్రష్ రష్మిక మందన్నాలో ఈ టాలెంట్ కూడా...

అమ్మ బాబోయ్..మన నేషనల్ క్రష్ రష్మిక మందన్నాలో ఈ టాలెంట్ కూడా ఉందా..? వీడియో వైరల్..!

సాధారణంగా జనాలు అనుకుంటూ ఉంటారు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే స్టార్ హీరోలు కానీ హీరోయిన్లు కానీ కేవలం నటించడానికే పనికి అని.. మిగతా విషయాలలో డమ్మీలుగా ఉంటారు అని .. మరీ ముఖ్యంగా చదువు విషయంలో శూన్యంగా ఉంటారు అంటూ ఎప్పటినుంచో ఒక అపోహా జనాల్లో ఉండిపోయింది. అయితే అలాంటి ది ఏమి లేదు అని అది అంత ఫేక్ అంటూ.. రష్మిక మరోసారి ప్రూవ్ చేసింది . రష్మిక మందన్నా.. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ .

ఆమె చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో ..ఆమె క్రేజీ ఫోన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా రష్మిక మందన్నా.. అంటే బాలీవుడ్ జనాలు పడి చచ్చిపోతూ ఉంటారు . దానికి కారణం ఆమె బోల్డ్ పర్ఫామెన్స్ . ఒకప్పుడు కేవలం పద్ధతిగా ఉండే రోల్స్ లో మాత్రమే కనిపించేది రష్మిక . కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చేసింది. ఎలాంటి రోల్స్ లోనైనా కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది . తాజాగా రష్మిక మందన్నా లో దాగి ఉన్న హిడెన్ టాలెంట్ బయటపడింది .

ఆమె పోస్ట్ చేసిన వీడియో ద్వారా ఈ విషయం బాగా వైరల్ గా మారింది. రష్మిక మందన్నా మేకప్స్ మాత్రమే వేసుకుంటుంది అని కిచెన్ లోకి వెళ్ళదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే అది తప్పు అని ప్రూవ్ చేసింది హాట్ బ్యూటీ రష్మిక మందన్నా..ఆమె వంట బాగా చేస్తుందట . ఆమెకు నచ్చిన ఫుడ్ ఆమె వండుకొని తింటుందట. మరీ ముఖ్యంగా స్పీనాచ్.. మష్రూమ్ ఆమ్లెట్ ఆమె ఫేవరెట్ అంటూ చెప్పుకొచ్చింది .అంతేకాదు ఆ ఆమ్లెట్ ని ఎలా తయారు చేయాలో కూడా చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన వీడియో బాగా వైరల్ గా మారింది. రష్మిక మందన్నా లాంటి స్టార్ హీరోయిన్ కూడా కిచెన్ లో వంట చేస్తుందా ..?నమ్మలేకపోతున్నామే అంటున్నారు జనాలు. మరికొందరు ఎంత స్టార్ సెలబ్రెటీ అయినా తన ఫుడ్ తాను చేసుకుని తినడంలోనే ఆ సంతోషం అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ప్రెసెంట్ రష్మిక మందన్నా కి సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news