Newsబాలకృష్ణకు న్యాయం చేసి జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు అన్యాయం చేసిన క్రేజీ హీరోయిన్‌...!

బాలకృష్ణకు న్యాయం చేసి జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు అన్యాయం చేసిన క్రేజీ హీరోయిన్‌…!

ఈతరం స్టార్ హీరోయిన్లలో చాలామంది స్టార్ హీరోయిన్లు లక్కీ హీరోయిన్లు అనే చెప్పాలి. అటు సీనియర్ హీరోలతో ఇటు యంగ్ జనరేషన్ స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశాన్ని ఈ జనరేషన్ స్టార్ హీరోయిన్లు సొంతం చేసుకుంటున్నారు. బాబాయ్ బాలకృష్ణతో, అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం బాలకృష్ణకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రం అట్టర్ ఫ్లాప్ ఇచ్చారు.

కమల్ హాసన్ కూతురు, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ బాలయ్యతో కలిసి నటించిన సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకుని నిర్మాతలకు లాభాలను అందిస్తే ఎన్టీఆర్ సినిమా మాత్రం రికార్డ్ స్థాయిలో నష్టాలను మిగిల్చింది. జూనియర్ ఎన్టీఆర్, శృతి హాసన్ కాంబోలో రామయ్యా వస్తావయ్యా సినిమా తెరకెక్కగా ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడానికి శృతి కారణమని చాలామంది భావిస్తారు.

రామయ్యా వస్తావయ్యా సినిమాలో పల్లెటూరి యువతి పాత్రలో శృతి హాసన్ నటించగా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. పల్లెటూరి యువతి పాత్రలో నటించిన శృతి హాసన్ మోడ్రన్ దుస్తుల్లో కనిపించడం మైనస్ అయింది. రామయ్యా వస్తాయయ్యా సెకండాఫ్ రొటీన్ కథతో తెరకెక్కడం వల్ల కూడా ఈ సినిమా ఫ్లాపైంది. అప్పట్లో ఈ సినిమా 35 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.

అయితే అబ్బాయ్ కు షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ బాలయ్యకు జోడీగా వీరసింహారెడ్డి సినిమాలో నటించగా ఈ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్టైంది. ఫుల్ రన్ లో వీరసింహారెడ్డి 75 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించింది. బాలయ్య, శృతి జోడీ బాగుందని కామెంట్లు వినిపించాయి. రామయ్యా వస్తావయ్యా సినిమాతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో వీరసింహారెడ్డి సినిమా కలెక్షన్లను సొంతం చేసుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news