Newsఛాన్సులు రాక ఆ ఇద్ద‌రి వెంట ప‌డుతోన్న ర‌ష్మిక‌... ఓ తెలుగు...

ఛాన్సులు రాక ఆ ఇద్ద‌రి వెంట ప‌డుతోన్న ర‌ష్మిక‌… ఓ తెలుగు స్టార్ హీరో కూడా…!

రష్మిక మందన్న కెరీర్ మహా అద్భుతంగా సాగడం లేదు. అలా అని నత్త నడకనా నడవడం లేదు. ఉన్నంతవరకూ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం చేతిలో సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప ది రూల్ లో నటిస్తోంది. ఈ సినిమాతో రష్మిక క్రేజ్ మరో రేంజ్ కి వెళుతుందని చాలా నమ్మకాలు పెట్టుకుంది. పుష్ప మూవీతో వచ్చిన క్రేజ్ ని రష్మిక సరిగ్గా ఉపయోగించుకోలేదు.

అత్యాశకి పోయి ఆమె ఎక్కువగా బాలీవుడ్ సినిమాలను ఎంచుకుంది. అదే తెలుగులో సినిమాలు ఒప్పుకుంటే ఆ కథ వేరేగా ఉండేది. కానీ, బాలీవుడ్ మీద ఆసక్తితో ఎక్కువగా అక్కడే ఫోకస పెట్టి వరుస ఫ్లాపులు చూసింది. దాంతో బాలీవుడ్ లో ఇప్పుడు రష్మిక ఆశలన్నీ యానిమల్ మూవీ మీద దీన్ని తెరకెక్కించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మీద పెట్టుకుంది.

అంతేకాదు, సందీప్ రెడ్డి నెక్స్ట్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమాను తెరకెక్కించనున్నాడు. వచ్చే ఏడాది జూన్ లేదా జూలై నుంచి సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఛాన్ ఇవ్వమని రష్మిక మందన్న సందీప్ రెడ్డిని అడుగుతుందట. యానిమల్ సినిమాలో ఆయన చెప్పినట్టు చేసి మెప్పు పొందింది. అందుకే, ప్రభాస్ మూవీలో కూడా ఆఫర్ కావాలని రిక్వెస్ట్ చేస్తుందట.

ఇక సుకుమార్ ని కూడా రష్మిక మందన్న తన నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇవ్వమనే కాకా పడుతుందని చెప్పుకుంటున్నారు. పుష్ప 1 లో సుకుమార్ చెప్పినట్టుగా డీ గ్లామర్ రోల్ చేసింది. అంతేకాదు, కాస్త స్కిన్ షీ కూడా చేసి మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. సినిమా ప్రమోషన్స్ కి బాగా సపోర్ట్ చేసుకుంది. ఇప్పుడు రష్మిక చేస్తున్న వారిలో సందెప్ రెడ్డి, సుకుమార్ లతో చాలా క్లోజ్ గా ఉంటుందట. తప్పదు మరి పాన్ ఇండియన్ సినిమా కావాలంటే అంతే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news