News" ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. న్యూడ్ గా అలా చేస్తా...

” ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. న్యూడ్ గా అలా చేస్తా “..బంపర్ ఆఫర్ ప్రకటించిన బోల్డ్ బ్యూటీ..!

భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు దూసుకెళ్లింది. ముంబైలో జరిగిన సెమీఫైనల్ లో 70 పరుగులు తేడాతో న్యూజిలాండ్ పై ఘనవిజయం సాధించి ఫైనల్ కు వెళ్ళింది. టోర్నీ ప్రారంభం నుంచి అసలు అపజయం అనేది లేకుండా ప్రపంచకప్‌లో భారత జైత్ర యాత్ర కొన‌గుతోంది. వరుసగా పది మ్యాచ్‌ల‌లో ఘనవిజయాలు సాధించి ఆదివారం జరిగే ఫైనల్ పోరుకు భారత రెడీ అవుతుంది. ఈసారి కచ్చితంగా భారత ప్రపంచకప్ గెలుస్తుంది అన్న అంచనాలు ఉన్నాయి.

ఇందుకు ప్రధాన కారణం జట్టులో అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. వచ్చే ఆదివారం అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రపంచక‌ప్‌ ఫైనల్ జరగనుంది. ఇదిలా ఉంటే భారత ప్రపంచకప్ గెలిస్తే విశాఖ బీచ్ లో నా దుస్తులు తొలగిస్తా అంటూ తెలుగు హీరోయిన్ ఒకరు షాకింగ్ కామెంట్స్ చేశారు. వైజాగ్ బ్యూటీ రేఖ భోజ‌న్‌ తన సోషల్ మీడియా ఖాతా నుంచి ఈ సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది. ఇండియా వరల్డ్ కప్ కొడితే వైజాగ్ బీచ్ లో స్ట్రేకింగ్ చేస్తా అంటూ ఆమె పోస్ట్ పెట్టింది.

ఫుట్‌బాల్, బ్యాట్మెంటన్, బాక్సింగ్ వంటి ఆటలలో తన జట్టు గెలిచినప్పుడు కొందరు పట్టరాని ఆనందంలో బట్టలు విప్పి పరుగులు తీస్తూ ఉంటారు. అలా ఒంటిపై బట్టలు లేకుండా పరుగులు పెట్టడమే స్ట్రీకింగ్ అంటారు. ఈ కల్చర్ ఎక్కువగా పాశ్యాత్య‌ దేశాల్లో కనిపిస్తుంది. తమ అభిమాన జట్టు గెలిచినప్పుడు వాళ్ళు పట్టరాని ఆనందంతో ఇలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు రేఖ భోజ‌న్‌ కూడా ఇండియా మ్యాచ్ గెలిస్తే తాను కూడా అలాగే చేస్తాను అని ఇండియా గెలవడం కంటే ఆనందం ఏముంటుందని ?తెలుపుతోంది.

ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలిస్తే వైజాగ్ బీచ్‌లో తన దుస్తులు తొలగించి పరిగెడతానని ఆమె బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే రేఖ వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఆమె వ్యాఖ్యలు సిగ్గుచేటు అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే రేఖ మాత్రం తనకు క్రికెట్ మీద అభిమానం తప్ప.. తాను పాపులర్ అయ్యేందుకు ఇలా చేయడం లేదని కామెంట్ చేస్తుంది. ఇక రేఖ మాంగల్యం, దామిని వెళ్లా, కాత్యాయని, స్వాతి చినుకు, రంగీలా వంటి సినిమాల్లో నటించింది.

రేఖ సినిమా కెరీర్ విష‌యానికి వ‌స్తే ఆమె వైజాగ్ అమ్మాయి. ఆ తర్వాత పెద్దగా సినిమా అవకాశాలు కూడా రాక వైజాగ్‌లో సొంతంగా స్టూడియో పెట్టుకుని కవర్ సాంగ్స్ చేస్తూ యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతుంది. గతంలో ఆమె టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ పై కూడా వైరల్ కామెంట్ చేసింది. విశాఖపట్నంలో కైలాసపురానికి చెందిన రేఖ.. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. నటనపై మక్కువ‌తో వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుని చదువు పూర్తయ్యాక హీరోయిన్గా ఛాన్సుల‌ కోసం ట్రై చేసి అలా చిన్న చిన్న అవ‌కాశాలు ద‌క్కించుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news