Newsగుస‌గుస‌: టాలీవుడ్‌లో బోల్డ్ హీరోయిన్‌... హాట్ డైరెక్ట‌ర్ ఫుల్ కోప‌రేష‌న్‌...!

గుస‌గుస‌: టాలీవుడ్‌లో బోల్డ్ హీరోయిన్‌… హాట్ డైరెక్ట‌ర్ ఫుల్ కోప‌రేష‌న్‌…!

సినిమా రంగంలో హీరోలు, డైరెక్టర్ల మధ్య సహాయ సహకారాలు, కోపరేషన్లు మామూలుగానే ఉంటాయి. ఇది ఇప్పటినుంచి కాదు.. కొన్ని దశాబ్దాల నుంచి నడుస్తోంది. తాజాగా టాలీవుడ్‌లో ఓ బోల్డ్ బ్యూటీ ఓ హాట్ డైరెక్టర్ మధ్య బాగా కోపరేషన్ నడుస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్, డైరెక్టర్‌లు ఎవరో కాదు ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై.. తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన‌ పాయల్ రాజ్‌పుత్. ఆమె తొలి సినిమాతో ఆమె తిరుగులేని బోల్డ్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత కూడా సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ స‌ర‌సన వెంకీమామ లాంటి సినిమాలో నటించింది.

కావలసినంత అందం ఉన్నా.. ఎంత చూపించినా.. పాయల్‌కు టాలీవుడ్‌లో రావలసిన క్రేజ్ రాలేదు. దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. అయితే తన తొలి సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తాజాగా మంగళవారం సినిమాలో నటించింది. ఈ సినిమాలో పాయ‌ల్‌ అందచందాలు ఏ రేంజ్ లో ఆరబోస్తుందో ఎప్పటికే రిలీజ్ అయిన ప్రచారా చిత్రాలు, టీజర్లు, ట్రైలర్లు చెప్పకనే చెప్పేసాయి. సినిమాలో పాయ‌ల్ క్యారెక్టర్ ఒక రేంజ్‌లో ఉండబోతుందని క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలోను ఇద్దరు కలిసి చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు.

డైరెక్టర్ అజయ్ భూపతిని పాయల్ ఏకంగా ఆకాశానికి ఎత్తేసింది. ఆయన వల్లే తాను నటి అయ్యానని తాజాగా తనకు ఛాన్సులు రాని టైంలో కూడా మంగళవారం.. లేడీ ఓరియంటెడ్ సినిమాలో తనని హీరోయిన్గా తీసుకున్నారని.. ఈ సినిమాలో హీరోయిన్గా కొత్త హీరోయిన్ తీసుకోవాలని అనుకున్నా తాను ఫోన్ చేసి అడగడంతో అజయ్ భూపతి తనకే ఛాన్స్ ఇచ్చారని పాయల్ తెగ పొగిడేసింది. ఇది అజయ్ తనకిచ్చిన సెకండ్ ఛాన్స్ అని పాయల్‌ చాలా గర్వంగా చెప్పింది.

అజయ్ భూపతి తన కెరీర్ ప్రారంభం నుంచి ఇండస్ట్రీలో చాలా సపోర్ట్ గా కోపరేషన్‌గా ఉన్నారని.. సరైన పాత్రలు ఎంపిక చేసుకోవడంలో తప్పులు జరిగినప్పుడు ఫోన్ చేసి మందలించే వారిని.. ఎలాంటి పాత్రలు చేయాలి, ఎలాంటి పాత్రలు చేయకూడదు ? లాంటి విలువైన సలహాలు కూడా ఆయన ఇస్తూ ఉంటారని పాయ‌ల్‌ తెలిపింది. ఆమె చేసిన ఈ కామెంట్లను బట్టి చూస్తే డైరెక్టర్ అజయ్ భూపతి పాయల్ రాజ్‌పుత్‌కు కెరీర్ పరంగా బాగా కోపరేషన్ చేస్తున్నారని.. వీరిద్దరి కోపరేషన్ మామూలుగా లేదన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.`

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news