Newsహైద‌రాబాద్‌లో ' భ‌గ‌వంత్ కేస‌రి ' తో బాల‌య్య హ్యాట్రిక్ రికార్డ్‌...!

హైద‌రాబాద్‌లో ‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ తో బాల‌య్య హ్యాట్రిక్ రికార్డ్‌…!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా, యంగ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల ముఖ్య‌పాత్ర‌లో న‌టించిన సినిమా భ‌గ‌వంత్ కేస‌రి. టాలీవుడ్‌లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోన్న అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా గ‌త నెల 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి హిట్ అయ్యింది. ప్ర‌పంచ వ్యాప్తంగా రు. 140 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌తో పాటు రు. 75 కోట్ల షేర్ రాబ‌ట్టిన ఈ సినిమా తాజాగా అమోజాన్ ప్రైమ్ వీడియోస్‌లో కూడా అందుబాటులో ఉంది.

అయినా కూడా ఇంకా చాలా థియేట‌ర్ల‌లో భ‌గ‌వంత్ కేస‌రి ర‌న్ అవుతోంది. అఖండ – వీరసింహారెడ్డి తర్వాత వచ్చిన భ‌గ‌వంత్ కేస‌రి హైద‌రాబాద్‌లో ఓ సెన్షేష‌న్ రికార్డ్ క్రియేట్ చేసింది. హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కూడా ఈ సినిమా హ్యాట్రిక్ కొట్టింది. బాల‌య్య గ‌త రెండు సినిమాలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో కోటి రూపాయ‌లు కొల్లగొట్టాయి.

ఇక ఇప్పుడు భ‌గ‌వంత్ కేస‌రి కూడా కోటి రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్ల‌తో ఈ లిస్టులో చేరిపోయింది. సీనియ‌ర్ హీరోల‌లో ఏ హీరోకు కూడా ఈ అరుదైన రికార్డ్ లేదు. భ‌గ‌వంత్ కేస‌రి సినిమాకు మ్యూజిక్ సెన్షేష‌న్‌ థమన్ సంగీతం అందించగా షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news