Newsబాల‌య్య ' అన్‌స్టాప‌బుల్‌ ' లో బాలీవుడ్ క్రేజీ హీరో...!

బాల‌య్య ‘ అన్‌స్టాప‌బుల్‌ ‘ లో బాలీవుడ్ క్రేజీ హీరో…!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లోనూ బిజీబిజీగా ఉన్నారు. తాజాగా దసరా కనుకగా భగవంత్ కేస‌రి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన బాలయ్య సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఇది బాలయ్యకు వరుసగా మూడో విజయం. ప్రస్తుతం బాలయ్య.. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 109వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాలయ్య మార్కు కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది.

ఇక బాలయ్య బుల్లితెరపై ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్‌ టాక్ షోను కూడా హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయవంతంగా రెండు సీజన్లు పూర్తి చేసుకున్న అన్‌స్టాప‌బుల్‌ లిమిటెడ్ ఎడిషన్ తో ప్రారంభమైంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో భగవంత్ కేస‌రి టీం ఎంట్రీ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది. అయితే లేటెస్ట్ క్రేజీ టాక్ ప్రకారం అన్‌స్టాప‌బుల్‌ లిమిటెడ్ ఎడిషన్ లో ఓ బాలీవుడ్ స్టార్ హీరో సందడి చేయబోతున్నాడు.

ఆ హీరో ఎవరో ? కాదు నటుడు రణబీర్ కపూర్. రణబీర్ కపూర్ – రష్మిక మందన్న కాంబినేషన్లో టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ అయితే నేషనల్ లెవెల్ లో ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా రష్మిక, రణబీర్ మధ్య వచ్చే లిప్ లాక్ సీన్లు యూత్ ను పిచ్చెక్కిస్తున్నాయి.

సినిమా ఎప్పుడు వస్తుందా ? ఎప్పుడు చూడాలా.. అన్న ఆసక్తి ఏర్పడింది. ఇక తాజాగా రణబీర్ కపూర్, రష్మిక తో పాటు ఆ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఈ షోలో సందడి చేయనున్నారు. త్వరలోనే దీనిని గ్రాండ్ ఎపిసోడ్ గా షూట్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా బాలయ్య – అన్‌స్టాప‌బుల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో అంటే బాలయ్య రచ్చ మామూలుగా ఉండదని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news