Newsఆ సినిమా సీక్వెల్లో బాల‌కృష్ణ‌.. అబ్బ మ‌ళ్లీ కొత్త బాల‌య్య‌ను చూడ‌డం...

ఆ సినిమా సీక్వెల్లో బాల‌కృష్ణ‌.. అబ్బ మ‌ళ్లీ కొత్త బాల‌య్య‌ను చూడ‌డం ప‌క్కా…!

నందమూరి బాలకృష్ణ వరుసగా అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేస‌రి సినిమాలతో హిట్లు కొట్టి ఉన్నారు. ప్రస్తుతం బాలయ్య.. బాబి దర్శకత్వంలో తన కెరీర్లో 109వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కూడా బాలయ్య లైన్ అప్‌ చాలా స్ట్రాంగ్ గా ఉంది. వరుసగా క్రేజీ దర్శకులు బాలయ్యతో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక బాలయ్య కెరీర్‌లో వైవిధ్యమైన సినిమాలలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పైసా వసూల్ సినిమా ఒకటి.

ఈ సినిమా కమర్షియల్ గా ఎంతవరకు సక్సెస్ అయ్యింది.. అన్నది పక్కన పెడితే కొత్త బాలయ్యను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. సినిమాలో బాలయ్య నటన, డైలాగ్ డెలివరీ, యాటిట్యూడ్ అందరు హీరోల అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చేసాయి. సినిమా చూస్తున్నంత‌సేపు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక బాలయ్యకు మంచి పేరు వచ్చింది.

ఆ వెంటనే బాలయ్య పూరీ జగన్నాథ్‌తో సినిమా రిజల్ట్ ఎలా ఉంది ? అన్నది పక్కన పెడితే సినిమా షూటింగ్ జరుగుతుందని రోజులు తాను బాగా ఎంజాయ్ చేశానని మరో మంచి కథ రెడీ చేసుకుంటే మళ్ళీ సినిమా చేస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత బాలయ్య కూడా వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో బిజీ అయ్యారు.
బాబి తర్వాత మరోసారి బోయపాటి – బాలయ్య కాంబినేషన్లో సినిమా రానుంది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ – బాలయ్య కాంబినేషన్ కూడా పట్టాలు ఎక్కన్నుంది.

ఇది కూడా పైసా వసూల్ స్టైల్ లోనే ఉంటుందని తెలుస్తోంది. పైసా వసూల్ షూటింగ్ పూర్తయిన వెంటనే పూరి మరోకథ రెడ్డి చేసి బాలయ్యకు వినిపించుగా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట. ఏది ఏమైనా బాబి, బోయపాటి సినిమాల తర్వాత మళ్లీ బాలయ్య పూరి జగన్నాథ్ పైసా వసూల్ హంగామా అయితే ఉంటుందన్నది క్లారిటీ వచ్చేసింది. ఇది పైసా వ‌సూల్ 2 అనుకోవ‌చ్చేమో అని బాల‌య్య ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news