Newsమ‌రో క్రేజీ ప్రాజెక్టుకు ప్ర‌భాస్ గ్రీన్‌సిగ్న‌ల్‌... ఆ ల‌క్కీ ఛాన్స్ కొట్టేసిన...

మ‌రో క్రేజీ ప్రాజెక్టుకు ప్ర‌భాస్ గ్రీన్‌సిగ్న‌ల్‌… ఆ ల‌క్కీ ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ డైరెక్ట‌ర్ ఎవ‌రంటే..!

ప్రస్తుతం పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఆది పురుష్, సాహో సినిమాల‌తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ప్రభాస్ డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా సలార్ సినిమాతో డైనోసార్ గా బాక్సాఫీస్ దగ్గర గర్జిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా కల్కి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. ఇలా వరుసగా ప్రభాస్ లైన్లో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. మధ్యలో మారుతి సినిమా కూడా ఉంది.

అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో కూడా ప్రభాస్ నటించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులు అన్నీ ఒకదానిని మించి మరొకటి క్రేజీ ప్రాజెక్టులు అని చెప్పాలి. తన లైన‌ఫ్ లో ప్రభాస్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అది కూడా టాలీవుడ్‌లో యంగ్ డైరెక్టర్ కి ప్రభాస్ ఛాన్స్ ఇవ్వడం ఇప్పుడు సినిమా వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఆ దర్శకుడు ఎవరో కాదు.. నానితో దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల‌.

దసరా సినిమా నాని కెరీర్ లో ఫస్ట్ టైం రూ.100 కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ తెరకెక్కించిన తీరుకు ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. ఇప్పుడు శ్రీకాంత్ కు ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్టు చేసేందుకు ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే కథ‌ మెయిన్ లైన్ ప్రభాస్‌కు చెప్పేసాడని.. కథను పూర్తిగా డెవలప్ చేసే పనిలో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు రానున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news