Newsమంచు ల‌క్ష్మికి ఘాటైన ముద్దు గ‌ట్టిగా ఇచ్చేసిన అల్లు శిరీష్‌..!

మంచు ల‌క్ష్మికి ఘాటైన ముద్దు గ‌ట్టిగా ఇచ్చేసిన అల్లు శిరీష్‌..!

టాలీవుడ్ సీనియర్ నటి మంచు లక్ష్మి మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సిద్ధార్థ హీరోగా నటించిన అనగనగా ఓ ధీరుడు సినిమాలో లేడీ విలన్ ఐరేంద్రిగా అదరగొట్టేసింది. బుల్లితెరపై, వెండితెరపై ఎప్పటికప్పుడు సందడి చేసే మంచు లక్ష్మి తాజాగా మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ దీపావళి సందర్భంగా తన ఇంట్లో ఏర్పాటు చేసిన పార్టీకి హాజరైంది, ఈ పార్టీకి టాప్ స్టార్స్ కుటుంబాలతో పాటు మహేష్ బాబు, ఎన్టీఆర్, వెంకటేష్ కుటుంబాలు సందడి చేశాయి.

ఈ పార్టీ ఫోటోలు సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చిగా వైరల్ అయ్యాయి. ఈ పార్టీకి మంచు లక్ష్మి సిల్వర్ కలర్ స్లీవ్‌లెస్ ప్రాక్ ధ‌రించి పార్టీలోనే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. తాజాగా మంచు లక్ష్మి తన ఇన్‌స్టాలో ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. ఈ పార్టీలో మంచు లక్ష్మిని అల్లు శిరీష్ చాలా గట్టిగా ముద్దాడుతున్న ఫోటో కూడా ఉంది.

ఆమె బుగ్గపై శిరీష్ చాలా ఘాటు ముద్దు పెట్టాడు. ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. అది పార్టీ కల్చర్ లో భాగమైన పెళ్లైన మంచు లక్ష్మికి.. బ్యాచిలర్ అయిన శిరీష్‌ ఆ రేంజ్ లో ముద్దు ఇవ్వ‌డం చర్చ‌కి దారితీసింది. అది చూసిన నెటిజన్లు కూడా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోలో ల‌క్ష్మి మాత్ర‌మే కాదు.. అంద‌రూ క‌ళ్లు జిగేల్‌మ‌నే డ్రెస్సులు వేసుకుని హంగామా చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news