Moviesబిగ్ బాస్ 7: ఊహించని కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేసిన నాగార్జున..?...

బిగ్ బాస్ 7: ఊహించని కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేసిన నాగార్జున..? నిజంగానే ఉల్టా పల్టా ఇది..!!

బిగ్బాస్ సీజన్ సెవెన్ ..ఎలా రసవత్తరంగా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డైలీ బిగ్ బాస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయం బాగా తెలుసు . అయితే ఇన్నాళ్లు హౌస్ లో టాప్ కంటెస్టెంట్ గా ఉన్న ఓ కంటెస్టెంట్ ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వబోతున్నాడు అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు . సందీప్.. ఈయన హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే టాప్ ఫైవ్ లో ఉంటాడు అని జనాలు బలంగా ఫిక్స్ అయ్యారు.

అయితే హౌస్ లోకి వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తన జనాలకు నచ్చలేదు . ఫిజికల్ గా మెంటల్ గా .. స్ట్రాంగ్ అయిన సందీప్ ను కావాలని కొందరు తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ బయట ఉండే జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అయితే ఈ వారం నామినేషన్స్ లో శివాజీ , భోలే , అమర్ దీప్, సందీప్ , శోభాశెట్టి ,ప్రియాంక ,గౌతమ్ , అశ్విని ఉన్నారు .

అయితే ఈసారి శివాజీకి ఎక్కువ ఓట్లు పడడంతో ఆయన సేఫ్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. భోళే రెండో స్థానంలో ఉన్నట్లు పోల్స్ ఆధారంగా తెలుస్తుంది. ఇక మిగిలిన అమర్ దీప్, అశ్విని , గౌతమ్ , ప్రియాంక తర్వాత స్థానాలలో సరిపెట్టుకున్నారట . డేంజర్ లో ఉన్నది సందీప్ , శోభా శెట్టి అంటూ తెలుస్తుంది. నేను ఈ వారం సేఫ్ అంటూ ఫిక్స్ అయిపోయింది . ఆమె కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తుంటే కచ్చితంగా సేఫ్ అయ్యేటట్లు కనిపిస్తుంది. ఇక మిగిలింది సందీప్. సందీప్ మాస్టర్ ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయి బయటికి వచ్చేస్తాడు అన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news