Newsఎయిర్‌పోర్టులో బ‌న్నీ చేతిలో చెయ్యేసి స్టైలీష్ లుక్‌లో స్నేహారెడ్డి..!

ఎయిర్‌పోర్టులో బ‌న్నీ చేతిలో చెయ్యేసి స్టైలీష్ లుక్‌లో స్నేహారెడ్డి..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ‌ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డుకి ఎన్నికైన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన పుష్ప సినిమాలో నటనకు గాను ఈ అవార్డును అందుకోబోతున్నాడు. టాలీవుడ్ చరిత్రలో ఇప్పటివరకు ఈ అవార్డు ఒక కలలా ఉండేది. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఈ పురస్కారం అందుకున్న తొలి నటుడుగా అల్లు అర్జున్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇక జాతీయ‌ అవార్డుల పురస్కారం రేపు అక్టోబర్ 17న ఢిల్లీలో జరగనుంది.

దీంతో జాతీయ అవార్డులు గెలుచుకున్న వారంతా ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ బాట ప‌ట్టారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా ఢిల్లీకి ప‌య‌న‌మ‌య్యాడు. బన్నీ సతీమణి అల్లు స్నేహారెడ్డి కూడా ఈ వేడుకకు వెళుతున్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బన్నీ దంపతులు ఢిల్లీకి బయలుదేరిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలో బ‌న్నీ భార్య స్నేహారెడ్డి భ‌ర్త చేతిలో చెయ్యేసి క‌ళ్ల‌కు గ్లాసెష్ పెట్టుకుని చాలా స్టైలీష్ లుక్‌లో క‌నిపిస్తోంది.

టాలీవుడ్ కి వస్తున్న మొదటి ఉత్తమ జాతీయ నటుడు అవార్డు కావడంతో ఈ పురస్కార వేడుక చూసేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఢిల్లీలో జాతీయ అవార్డు అందుకుని హైదరాబాద్ తిరిగి వచ్చే అల్లు అర్జున్ కి భారీగా వెల్కమ్ పలికేందుకు అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. పుష్ప సినిమా సూపర్ హిట్ అయ్యాక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప ది రూల్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మాటల మంత్రి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ – బన్నీ కాంబినేషన్లో తెర‌కెక్కే నాలుగో సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news