News' లియో ' హిట్ అవ్వ‌డం న‌య‌న‌తార మొగుడు విఘ్నేష్‌కు ఇష్టం...

‘ లియో ‘ హిట్ అవ్వ‌డం న‌య‌న‌తార మొగుడు విఘ్నేష్‌కు ఇష్టం లేదా.. ఇంత పైశాచికానందం ఏంటి..!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాలు రిలీజ్ కి ముందు వివాదాస్పదం కావటం ఇప్పుడు కొత్త కాదు. తాజాగా ఆయన హీరోగా నటించిన లియో సినిమా కూడా రిలీజ్ ముందే వివాదాల్లో చిక్కుకుంది. మాస్టర్ లాంటి సక్సెస్ఫుల్ సినిమా తర్వాత విజయ్ – దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా లియో. గత ఏడాది కమలహాసన్ తో విక్రమ్ లాంటి సెన్సేషనల్ హిట్ సినిమా తెరకెక్కించిన లోకేష్ ఇప్పుడు విజయ్ తో లియో సినిమా తీశాడు.

7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ల‌లిత్‌ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో త్రిష, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా, బాలీవుడ్ యాక్షన్ కింగ్ అర్జున్, దర్శకుడు గౌతమ్ మీనన్, దర్శకుడు మిస్కిన్ కీలకపాత్రలో నటించారు. అలాగే మరో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ మెయిన్ విలన్ గా నటించారు. దసరా కానుకగా అక్టోబర్ 19న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది.

లియో సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమాపై కాంట్రవర్సీ మొదలైంది. ట్రైలర్ లో విజయ్ చెప్పే పవర్ఫుల్ డైలాగులు ఆయన అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చేసాయి. అయితే కొన్ని డైలాగ్లు ఇప్పుడు పెద్ద దుమారానికి దారితీస్తున్నాయి. ఈ డైలాగులపై ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
ఈ కాంట్రవర్సీ పై దర్శకుడు లోకేష్ స్పందించారు. ఈ సంభాషణలతో విజయ్ కి ఎలాంటి సంబంధం ?లేదని.. ఈ డైలాగులు చెప్పాలా ? అని ఆయన సైతం సందేహం వ్యక్తం చేశారని తానే.. అవసరమని ఒప్పించానని వివరణ ఇచ్చారు.

ఇంకా చెప్పాలంటే అవి విజయ్ చెప్పిన సంభాషణ కాదని.. సినిమాలో పార్తీబ‌న్‌ అనే పాత్ర చెప్పిన సంభాషణలని పేర్కొన్నాడు. దానికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని కూడా తెలిపారు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక హీరో విజయ్ – దర్శకుడు లోకేష్ మధ్య విభేదాలు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి . అయితే అలాంటి పోస్టుకు నయనతార మొగుడు దర్శకుడు విగ్నేష్ శివ‌న్‌ లైక్ కొట్టడం పెద్ద దుమారం రేపింది.

ఈ పోస్టుల‌పై తమిళనాడు లో రజినీకాంత్ అభిమానులు ఎంజాయ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి యాంటీ పోస్టుల‌కు విఘ్నేష్ లైక్ కొట్టడంతో లియో సినిమా హిట్ అవ్వటం విగ్నేష్ కి కూడా ఇష్టం లేదా అన్న చర్చ మొదలైంది . దీనిపై విగ్నేష్ క్షమాపణ కోరాడు. తాను ఆ ట్వీట్ సరిగా చూడకుండా లైక్ కొట్టానని.. అందుకు క్షమాపణ చెప్పుకుంటున్నానని మరో ట్వీట్ చేయటం గమనార్హం . ఏదైనా విజయ్ లియో సినిమాను తమిళనాడులో చాలామంది టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఇదే ట్రెండింగ్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news