Newsఎన్టీఆర్ తొలి సినిమా ‘మనదేశం’ పారితోషికం ఎంతో తెలుసా... షాకింగ్ లెక్క...

ఎన్టీఆర్ తొలి సినిమా ‘మనదేశం’ పారితోషికం ఎంతో తెలుసా… షాకింగ్ లెక్క ఇది…!

తెలుగు సినిమా పరిశ్రమ గతి మార్చిన హీరోలలో సీనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ముందు వరసలో ఉంటారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడుగా తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని శాశ్వతం చేసిన మహా నాయకుడు. నటుడుగా రాజకీయనేతగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నత వ్యక్తిత్వం ఎన్టీఆర్‌కు సొంతం. ఎన్టీఆర్ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టడంతోనే సినిమా పరిశ్రమ చరిత్ర మారిపోయింది. ఆయన రాజకీయ అరంగేట్రం కూడా తెలుగు నేల గతిని మార్చింది. చిత్ర పరిశ్రమలో ఆయన చేయని పాత్ర అంటూ లేదు.

సమాజ హితం కోసం తన ఇమేజ్‌ను కూడా పక్కనపెట్టి.. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి నటించగలరు. ఈ విధంగా ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం మనదేశం.. 1949 నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు ఎల్ వి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ చిన్న పోలీస్ పాత్రలో నటించారు. విప్రదాస్’ అనే బెంగాలీ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రసిద్ధ నటులు చిత్తూరు నాగయ్య, కృష్ణవేణి, రేలంగి తదితరులు ఇందులో నటించారు.

తెలుగువారి ఆరాధ్య దైవంగా మారిన ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం స్వాతంత్య్రం రాక ముందు ప్రారంభమైనా.. స్వాతంత్య్రం వచ్చిన తరువాత విడులైంది. ఇక మ‌రో విషయం ఏమిటంటే సంగీత దర్శకుడిగా ఘంటసాల వెంకటేశ్వరరావుకు కూడా ఇదే తొలి సినిమా కావడంమ‌రో విశేషం. ఈ చిత్రం తరువాత బెంగాళి నవలల ఆధారంగా తెలుగు చిత్రాలు ఎన్నో వ‌చ్చాయి. దేవదాసు, ఆరాధన వంటి సినిమాలు కూడా ఇదే పరంపరలోనే వచ్చాయి.

ఇక అలా ఎన్టీఆర్ తన మొదటి సినిమా మన దేశంకు అందుకున్న పారితోషకం ఎంత అంటే.. అక్ష‌రాలా రూ.250లు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా రూపొందించిన ఎన్టీఆర్ సావనీర్ లో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇక ప్ర‌స్త‌తం నెటి తారం హీరోలు కోట్ల రూపాయాలో పారితోషికం అందుకుంటున్నారు. అలాంటిది రూ. 250ల‌తో సినికేరీర్ మొద‌లు పెట్టిన ఎన్టీఆర్ వెండితెర‌కు మ‌కుటం తేని మ‌హ‌రాజుగా ఎదిగారు. ముఖ్యంగా ముఖ్యంగా పౌరాణిక, జానపద చిత్రాల గతిని మార్చగలిగారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా మారారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news