Newsపెళ్లికి ముందే రేణుదేశాయ్‌కు మెంట‌ల్ టార్చ‌ర్‌... ఓదార్పు కోస‌మే ప‌వ‌న్‌కు ద‌గ్గ‌రైందా...!

పెళ్లికి ముందే రేణుదేశాయ్‌కు మెంట‌ల్ టార్చ‌ర్‌… ఓదార్పు కోస‌మే ప‌వ‌న్‌కు ద‌గ్గ‌రైందా…!

రేణు దేశాయ్ ఈ పేరు వినిపించగానే మనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్యగా టాలీవుడ్ లో బద్రి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా హీరోయిన్గా.. అలాగే పవన్ పక్కన జానీ లాంటి ప్లాప్ సినిమాలో హీరోయిన్గా తెలుస్తుంది. రేణు దేశాయ్ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవటం.. ఇద్దరు పిల్లలకు తల్లి కావటం.. ఆ తర్వాత విడాకులు ఇవ్వడం ఇవన్నీ గత 20 ఏళ్లుగా ఆమె గురించి అందరికీ తెలిసినవే. మహారాష్ట్రకు చెందిన రేణు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బద్రి సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం అయింది.

ఆ తర్వాత పవన్ తో చాలా ఏళ్ల పాటు సహజీవనం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. 11 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరిద్దరూ మనస్పర్ధలు నేపథ్యంలో విడాకులు తీసుకున్నారు. పవన్ కి విడాకులు ఇచ్చాక తెలుగు గడ్డకు దూరమై మహారాష్ట్రలో పూణేలో ఉంటున్న రేణు దేశాయ్ ఇప్పుడు ఇన్నేళ్ల‌కు రేణు దేశాయ్ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ఇస్తోంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తో ప్రేమ, పెళ్లి విడాకులు అన్నవి మాత్రమే తన జీవితంలో కష్టాలు కాదని పవన్ కళ్యాణ్ రాకముందు నుంచే తన జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయని రేణు తన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.

మా అమ్మా, నాన్నలు అబ్బాయి పుట్టాలని కోరుకున్నారు.. కానీ నేను అమ్మాయిగా పుట్టాను అలా నా ఇంట్లోనే లింగ వివ‌క్షకు గురైనట్టు రేణు వాపోయింది. మా నాన్న కోరిక ప్రకారం అబ్బాయి పుట్టలేదని నేను పుట్టిన మూడు రోజులు పాటు నా తండ్రి నా మొఖం కూడా చూడలేదు.. నేను పుట్టిన ఏడాదిలోనే మా తమ్ముడు పుట్టేశాడు.. అప్పుడు వాడిని రాజబాబు లా పెంచారు.. దీనిని బట్టి నేను ఎలాంటి పరిస్థితుల్లో పెరిగానో ? ఎలా పెంచారు అనేది మీరు అర్థం చేసుకోవాలని రేణు ఎమోషనల్ అయ్యారు.

తన కుటుంబంలో ఆడబిడ్డని ఒకలా.. మగ బిడ్డని మరోలా చూసారని రేణు చెప్పుకొచ్చారు. తన జీవితంలో తల్లి ఉండి కూడా తల్లి ప్రేమను పొందలేకపోయానని.. 18 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఇంట్లో ఆ తేడా చూశానని రేణు వాపోయారు. తన బాగోగులు ఇంట్లోని పని వాళ్ళే చూసుకున్నారని తల్లిదండ్రుల ప్రేమ పొందేందుకు స్కూల్లో ఎంత బాగా చదివినా తనకు తల్లి ప్రేమ దొరకలేదని రేణు దేశాయ్ పేర్కొన్నారు.

ఆ బాధ తట్టుకోలేక నాకు 19 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒకరోజు అమ్మని అడిగాను.. అమ్మ నీ ప్రేమ నాకు ఎందుకు ఇవ్వటం లేదు ? అంటే అమ్మ నుంచి సమాధానం లేదని.. నేను జీవితంలో ఏది కోల్పోయానో నా బిడ్డలు అది కోల్పోకూడదు అందుకే నా బిడ్డలకు రెట్టింపు ప్రేమను పంచుతున్నానని రేణు తెలిపింది. ఏది ఏమైనా రేణు 18 – 19 సంవత్సరాల వయసులోనే పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడింది ఆ టైంలో తల్లిదండ్రుల నుంచి దూరమైన ప్రేమ ఆ స్వాంత‌న పొందేందుకే ప‌వ‌న్‌తో ప్రేమ‌లో ప‌డిన‌ట్లు క్లియ‌ర్‌గా తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news