Newsబాల‌య్య ' భ‌గ‌వంత్ కేస‌రి ' లో కాజ‌ల్ రోల్ లీక్‌......

బాల‌య్య ‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ లో కాజ‌ల్ రోల్ లీక్‌… గుండెలు పిండేసే సెంటిమెంట్‌..!

నందమూరి నట‌సింహం బాల‌య్య‌ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భగవంత్‌ కేసరి. ఈ సినిమాలో శ్రీలీల ఒక ముఖ్య పాత్ర చేస్తుండగా విలన్ గా బాలీవుడ్ సీనియ‌ర్ హీరో అర్జున్ రాంపాల్ కనిపించనున్నారు. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళినప్పటి నుంచి అందరిలోనూ భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, ఫస్ట్ లుక్.. టీజర్, రెండు పాటలు అందర్నీ అలరించి అంచనాలను మరింత పెంచేశాయి.

సినిమా ఎప్పుడెప్పుడు ? థియేటర్లోకి వస్తుందని ఒక్కటే ఉత్కంఠ నెలకొంది. దసరా కానుకగా అక్టోబర్ 19న కేసరి థియేటర్లలోకి దిగుతోంది. ఇక ఈ సినిమా థియేటర్ ట్రైలర్ ఈవెంట్ వరంగల్ లో ఈరోజు గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ సినిమాలో కాజల్.. బాలయ్య భార్య పాత్రలో కనిపించనుంది. ఆమె పేరు కాత్యాయని. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో కాజల్ ఎల్లో కలర్ శారీలో తన అందంతో ఆకట్టుకుంటుంది. కాజల్ ఎల్లో కలర్ శారీ కట్టుకుని అందాలు చిందిస్తోంది. అయితే కాజల్ ఫేసులో ముదురు చాయిలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమెలో మునుపటి గ్లో అయితే తగ్గినట్టుగా కనిపిస్తోంది.

ఇక కాజాల పాత్ర సెకండ్ హాఫ్ ప్లాష్‌బ్యాక్‌లో వస్తుందని… సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న గుండెలు పిండేసే పాత్ర కాత్యాయనిధి అని తెలుస్తుంది. కాజల్ పాత్ర తెరమీద కనిపించేది కొద్దిసేపు అయినా.. ఆ పాత్ర సినిమా విజయంలో కీలకం కాబోతుందని తెలుస్తోంది. హరీష్ పెద్ది – సాహూ గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news