Newsచిరంజీవి సినిమా షూటింగ్‌ కోసం హైద‌రాబాద్ రైళ్ల‌న్నీ బంద్‌... ఆ బ్లాక్‌బ‌స్ట‌ర్...

చిరంజీవి సినిమా షూటింగ్‌ కోసం హైద‌రాబాద్ రైళ్ల‌న్నీ బంద్‌… ఆ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా చూడాలని ఉంది. 1998 ఆగస్టులో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ సినిమా ఓ సెన్సేషనల్. మణిశర్మ అందించిన పాటలు ఎవర్గ్రీన్. చిరు – అంజలా జవేరి మధ్య వచ్చే రైల్వే స్టేషన్ లవ్ సీన్ చాలా స్పెషల్. చిరు – అంజలి మధ్య డైలాగులు లేకుండా కేవలం ఎక్స్ప్రెషన్స్ తో ఆ సీన్ తెరకెక్కించి మెప్పించాడు.

దర్శకుడు గుణశేఖర్ ఆ సీను గురించి ఓ సందర్భంలో తన అనుభవాలు పంచుకున్నారు. రైల్వేస్టేషన్లో ఆ లవ్ సీన్ దాదాపు పది నిమిషాలు ఉంటుంది. చిరంజీవి గారికి అస్సలు డైలాగులు ఉండవు.. ఆయన స్టేషన్లో కుర్చీ మీద కూర్చుని అమ్మాయిని చూస్తూ ఉంటారు. చిరంజీవి లాంటి హీరో మీద డైలాగులు లేకుండా ఒక సీన్ నడపటం అంటే మామూలు విషయం కాదు.. అలాంటిది అంతసేపు షూట్ చేశామని గుణశేఖర్ గుర్తు చేసుకున్నారు.

ఆ సీన్ తీయటానికి నాంపల్లి – కాచిగూడ రైల్వే స్టేషన్ లో కావాలని నేను అడగడంతో నిర్మాత అశ్వినీద‌త్ గారు షాక్ అయిపోయారు.. అప్పట్లో నాంపల్లి స్టేషన్ పెద్దది.. అనేక రైళ్ల‌ రాకపోకలు సాగిస్తూ ఉంటాయి.. మూడు రోజులు చిరంజీవి గారిని పెట్టుకుని షూట్ చేయడమంటే చాలా కష్టం అని అశ్వినీద‌త్‌ తెలిపార‌ట.
రైల్వే శాఖ అన్ని రోజులు అనుమతి కూడా ఇవ్వదు.. ప్రయాణికులకు చాలా ఇబ్బంది.. అతి కష్టం మీద రైల్వే శాఖ కాచిగూడ – నాంపల్లి స్టేషన్లో సినిమా షూటింగ్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

దీంతో ఆ మూడు రోజులపాటు ఈ రెండు స్టేషనులతో పాటు పక్కనే ఉన్న కొన్ని స్టేషన్లో కూడా రైళ్లు కొద్దిసేపు బ్లాక్ అయిపోయాయి. విచిత్రం ఏంటంటే ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా చాలామంది ప్రయాణికులు సైతం రైలు ఎక్కకుండా స్టేషన్ లోనే ఆగిపోయి మరి ఆ సీన్ ఎలా ? షూట్ చేస్తున్నారో చూశారట. ఏదేమైనా ఆ సినిమా వచ్చి రెండున్నర దశాబ్దాలు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆ సీన్ చూస్తుంటే ఏదో తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో చిరుకు జోడిగా అంజలి ఝ‌వేరితో పాటు సౌందర్య కూడా నటించగా.. ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news