Newsతెగించేసిన ర‌ష్మిక‌... పెదాలు క‌లిపి... అర్జున్‌రెడ్డికి 10 రెట్లు ఉందిగా... (...

తెగించేసిన ర‌ష్మిక‌… పెదాలు క‌లిపి… అర్జున్‌రెడ్డికి 10 రెట్లు ఉందిగా… ( వీడియో)

బాలీవుడ్ లోనే కాదు చాలామంది సినిమా ప్రేక్షకుల కళ్ళు అన్ని ఇప్పుడు యానిమల్ సినిమా మీదే ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరో.. ఇందులో నేషనల్ క్ర‌ష్మిక ర‌ష్మిక మందన్న హీరోయిన్. ఇవన్నీ కాకుండా అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ సినిమాలతో దేశవ్యాప్తంగా యూత్ లో పిచ్చపిచ్చగా పాపులర్ అయిన సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా దర్శకుడు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ సినిమాలు అంటే యూత్లో పిచ్చపిచ్చ క్రేజ్ ఉంది.

ఈ క్రమంలోనే యానిమల్ సినిమా టీజర్ కొద్దిరోజుల క్రితం విడుదలైంది. ఈ టీజర్ బాగా వైరల్ అయింది. దీంతో ఈ సినిమా కోసం సౌత్ నుంచి నార్త్‌ వరకు సినీ జనాలు అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈరోజు ఈ సినిమా నుంచి ఒక పాట రిలీజ్ చేశారు. ఈ పాటను చూశాక రష్మిక ఎంతలా రెచ్చిపోయిందో తెలుస్తోంది. రష్మిక పూర్తిగా బరితెగించేసినట్టు క్లియర్గా తెలుస్తోంది. రష్మిక సినిమాలో గీత అనే పాత్రలో తెలుగు అమ్మాయిగా నటిస్తోంది.

అసలు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండతో అనేక మూతి ముద్దులు పెట్టి సెన్సేషనల్ క్రియేట్ చేశాడు. అదే సినిమాని హిందీలో కబీర్ సింగ్ పేరుతో షాహిద్ క‌పూర్‌తో చేసి అక్కడ అదే సెన్షేష‌న్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు యానిమల్ లో చూస్తే అర్జున్ రెడ్డి కన్నా పదింతలు ఎక్కువ రొమాన్స్ దానికి కూడా ఉండబోతుందని అర్థమవుతుంది. అసలు రణబీర్ – ర‌ష్మిక మధ్య ఎన్ని మూతి ముద్దు సన్నివేశాలు ఉన్నాయో అర్థం కావట్లేదు.

ఈ వీడియో అలా బయటకు వచ్చిందో లేదో సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. నెటిజన్లు ర‌ష్మిక‌పై భారీ ఎత్తున‌ విమర్శలు చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాకు ఏకంగా 10 రెట్లు ఎక్కువగా ఇందులో రొమాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అటు కన్నడ సినీ జనాలు కూడా రష్మిక తీరుపై గుర్రుగా ఉంటున్నారు. ఆమె సొంత భాష కన్నడలో సినిమాలు చేయకుండా బాలీవుడ్లో అవకాశాల కోసం ఇంతలా దిగజారిపోయే ప్రవర్తిస్తుందని తాము అనుకోలేదని రష్మిక‌ను టార్గెట్గా చేసుకుని రెచ్చిపోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news