Moviesతెలుగు సినీ ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌న రికార్డ్ దిశ‌గా బాల‌య్య‌... వావ్ శ‌భాష్‌...!

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌న రికార్డ్ దిశ‌గా బాల‌య్య‌… వావ్ శ‌భాష్‌…!

అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్లు రాబడుతున్నాడు. ఈ సినిమా దసరా కానుకగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్యని నెవర్ బిఫోర్ అనే రోల్ లో అనిల్ రావిపూడి చూపించాడు. బాలయ్య చేసిన పెర్ఫార్మన్స్ ఎన్నిసార్లు చూసినా తక్కువే అవుతుందంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఇక నందమూరి అభిమానులకు కూడా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చిన పోలీస్ గెటప్ బాగా నచ్చింది. వారు దాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కాంబినేషన్ బాగా సెట్ అయింది. బాలయ్య ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నింటితో పోలిస్తే ఇది చాలా ప్రత్యేకమని చెప్పాలి.
సినీ వర్గాలు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నాయి.

వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో రూ .70.2 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టిన ఈ సినిమాకు సండే బుకింగ్స్ కూడా అదిరిపోయాయి. సోమ, మంగళవారాలు రెండు రోజులు దసరా సెలవులు కావడంతో ఐదు రోజుల్లోనే ఈ సినిమా సులువుగా రూ.100 కోట్ల క్లబ్లోకి ప్రవేశించనుంది. సీనియర్ హీరోల్లో మూడుసార్లు వరుసగా రూ.100 కోట్లు రాబట్టిన అరుదైన రికార్డు బాలయ్య సొంతం చేసుకోబోతున్నారు.

అటు ఓవర్సీస్ లో వరుసగా మూడు సినిమాలతో వన్ మిలియన్ మార్క్‌కు చేరిన హీరోగా కూడా బాలయ్య రికార్డుల్లోకి ఎక్కబోతున్నారు. మూడు వరుస సినిమాలతో ఇటు రూ.100 కోట్లు.. అటు వన్ మిలియన్ డాలర్ల రికార్డులతో బాలయ్య టాలీవుడ్ లోనే ఏ సీనియర్ హీరోకి లేని అరుదైన రికార్డుతన ఖాతాలో వేసుకోబోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news