Moviesమహేశ్ బాబు-బ్రాహ్మిణి కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా...

మహేశ్ బాబు-బ్రాహ్మిణి కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఇదే..సెట్ అయ్యుంటే రచ్చ రంబోలా..!!

సినిమా ఇండస్ట్రీలో నాన్న పేర్లు తాతలు పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు హీరోయిన్స్ బోలెడు మందే ఉన్నారు. అయితే చాలా తక్కువ మంది మాత్రం సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం లేకుండా మంచి చదువులు చదువుకొని లైఫ్ లో సెటిల్ అయ్యారు . ఆ లిస్టులోకే వస్తుంది నందమూరి నటసింహం బాలయ్య కూతురు బ్రాహ్మిణీ. అందంలో హీరోయిన్స్ కి మించిపోతుంది .. చాలా చాలా తెలివితేటలు ఉన్నాయి..చదువులో ఫస్ట్ .. గోల్డ్ మెడలిస్ట్ స్టూడెంట్ .. అన్ని పాజిటివ్ పాయింట్సే.. ఒక్క నెగిటివ్ పాయింట్ లేని బ్రాహ్మిణి ప్రజెంట్ ఏ స్థాయిలో ఉందో మనకు తెలిసిందే.

కాగా నందమూరి నట సింహం బాలయ్య టాప్ హీరో కావడంతో చాలామంది డైరెక్టర్ మేకర్స్ ఆయన ఇంటికి వెళ్లేవారు. ఆ టైంలో బ్రాహ్మిణి ని చూసి చాలా అందంగా ఉంది చక్కగా ఉంది ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇప్పించొచ్చుగా అంటూ బాలయ్యను చాలా మంది ఫోర్స్ చేశారట. కానీ బ్రాహ్మిణికి ఫస్ట్ నుంచి సినిమాలలో నటించడం అంటే ఇష్టం లేదు . సినిమాలను ఎంటర్టైన్మెంట్ గానే చూసే ఆమెకి ఎన్ని అవకాశాలు వచ్చినా సరే ఆ సినిమాలను రిజెక్ట్ చేస్తూనే వచ్చింది. అలాంటి టాప్ సినిమాలలో మన మహేష్ బాబు సినిమా కూడా ఉంది .

మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన అతడు సినిమాలో త్రిష కంటే ముందుగా హీరోయిన్ రోల్ కి బ్రాహ్మణిని చూస్ చేసుకున్నారట మేకర్స్ . మహేష్ బాబు బ్రాహ్మిణి జంట చూడ చక్కగా ఉంటుంది. ఒకవేళ వీళ్ళ కాంబో సెట్ అయితే చరిత్ర తిరగరాస్తుంది అంటూ మేకర్స్ బాలయ్య వద్దకు వెళ్లి ప్రపోజల్ పెట్టారట. కానీ బాలయ్య ఫస్ట్ మాటతోనే మా అమ్మాయి సినిమాలో నటించదు అంటూ తెగేసి చెప్పారట . అంతేకాదు బ్రాహ్మిణి సైతం అదే ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేసింది . ఒకవేళ నిజంగా మహేష్ బాబు బ్రాహ్మణి కాంబో సెట్ అయి ఉంటే మాత్రం ఆ తర్వాత బ్రాహ్మిణి కెరియర్ ఎంత జెట్ స్పీడ్ లో దూసుకుపోయి ఉండేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నందమూరి ఫ్యాన్స్ మాత్రం బ్రాహ్మిణి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రాకపోవడమే మంచిది అయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news