Newsహీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న ఈ అమ్మాయి.. ఓ టాప్ డైరెక్ట‌ర్ కూతురు......

హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న ఈ అమ్మాయి.. ఓ టాప్ డైరెక్ట‌ర్ కూతురు… ఎవ‌రో తెలుసా..!

సినిమా రంగంలో వారసులు ఎంట్రీ ఇవ్వడం కామన్. కొంతమంది స్టార్ హీరోలు, స్టార్ దర్శకుల కుమార్తెలు కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఎప్పటికే స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె కూడా హీరోయిన్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మలయాళ డైరెక్టర్ ప్రియదర్శ‌న్‌ కుమార్తె కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ కుమార్తె కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు.

ఆమె ఎవరో కాదు కొరియోగ్రాఫర్, ప్రముఖ దర్శకుడు రాజీవ్ మీన‌న్ వార‌సురాలు సరస్వతి మీనన్. రంగనాథన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమాలో ఆమె హీరోయిన్గా నటిస్తున్నారు. మన తెలుగు కమెడియన్ సునీల్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అలాగే నటుడు యోగిబాబు – జేడీ చక్రవర్తి కూడా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

1990 ప్రాంతంలో సీనియర్ దర్శకుడు కే భాగ్యరాజ్ రూపొందించిన కొన్ని సినిమాలు తమిళంలో సూపర్ హిట్ అవడంతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. అలాంటి కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు ద‌ర్శ‌కుడు తెలిపారు. కథ‌, కథనాలు కొత్తగా ఉంటాయని పలు ఆసక్తికర అంశాలతో కూడిన ఈ చిత్ర కథను విన్న వెంటనే దర్శకుడు సెల్వరాఘ‌వ‌న్‌ ఇందులో నటించ‌డానికి ఓకే చెప్పార‌ని ద‌ర్శ‌కుడు తెలిపారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news