Moviesశ్రీజ ఫ్రెండ్ నే రెండో పెళ్లి చేసుకోబోతున్న కళ్యాణ్ దేవ్.. మెగా...

శ్రీజ ఫ్రెండ్ నే రెండో పెళ్లి చేసుకోబోతున్న కళ్యాణ్ దేవ్.. మెగా మాజీ అల్లుడు దెబ్బ అద్దిరిపోలా..?

యస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా డాటర్ శ్రీజ మాజీ భర్త కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..? అంటే అవునని సమాచారం అందుతుంది . మనకు తెలిసిందే శ్రీజ – కళ్యాణ్ దేవ్ తో పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో ..శ్రీజ కి మొదటి పెళ్లి అయినా సరే.. కళ్యాణ్ రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు . ఆ తర్వాత వీళ్ళిద్దరికీ ఓ పాప కూడా జన్మించింది.

లైఫ్ అంతా సాఫీ గా ముందుకు వెళ్ళిపోతున్న క్రమంలో వీళ్ళ మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి . తద్వారా వీళ్లు విడాకులు తీసుకున్నారు. వీళ్ళ విడాకుల విషయాని ఇప్పటివరకు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. కానీ వీళ్ళు మాత్రం దూరం దూరంగానే ఉంటున్నారు . ఇలాంటి క్రమంలోనే పలుసార్లు వీళ్లు సోషల్ మీడియా వేదికగా పెట్టే పోస్ట్ వాళ్ళ విడాకులను కన్ఫామ్ చేసినట్లు అయింది .

రీసెంట్గా సోషల్ మీడియాలో కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త వైరల్ అవుతుంది. కళ్యాణ్ దేవ్ పెళ్లి చేసుకోబోయేది కూడా శ్రీజ ఫ్రెండ్ ని అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో మెగా మాజీ అల్లుడు దెబ్బ అద్దిరిపోయింది అంటూ మెగా హెటర్స్ కళ్యాణ్ దేవకు సపోర్ట్ చేస్తున్నారు . అయితే మరి కొంతమంది మాత్రం శ్రీజ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతూ ఉండడంతో ..కావాలని శ్రీజ కు విడాకులు ఇచ్చాడా ..? కళ్యాణ్ దేవ్ ఆమెతో ఎఫైర్ నడిపాడా..? అన్న విధంగా కూడా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో శ్రీజ మాజీ భర్త కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లి మేటర్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news