Newsఅప్పుడే ' భ‌గ‌వంత్ కేస‌రి ' బుకింగ్స్‌... వీర‌సింహారెడ్డి డే 1...

అప్పుడే ‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ బుకింగ్స్‌… వీర‌సింహారెడ్డి డే 1 రికార్డ్స్ మ‌టాష్‌..!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా.. క్రేజీ హీరోయిన్ శ్రీలల కీలకపాత్రలో నటించిన సాలిడ్ యాక్షన్ సినిమా భగవంత్‌ కేసరి టాలీవుడ్ లో అసలు అపజయం అన్నది లేకుండా ఆరు వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా వచ్చేనెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అనిల్ రావిపూడి – బాలయ్య కాంబినేషన్లో తొలిసారిగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ సినీ సర్కిల్స్ తో పాటు ట్రేడ్ వర్గాల్లో మామూలు అంచనాలు లేవు.

ఇప్పటికే సోషల్ మీడియా అంతా భగవంత్ కేసరి, బాలయ్య నామస్మరణతో మార్మోగిపోతోంది. ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి దిగుతుందా ? అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోతో భగవత్ కేసరి సినిమా షూటింగ్ ముగిసింది అని దర్శకుడు అనిల్ రావి పూడి ప్రకటించేసాడు. అలాగే రిలీజ్ డేట్ విషయంలో కూడా మరోసారి క్లారిటీ ఇచ్చేశాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీమియర్ బుకింగ్స్ అప్పుడే స్టార్ట్ అయ్యాయి. యుఎస్ లో బుకింగ్స్ అలా ప్రారంభమయ్యాయో లేదో చక చక టికెట్లు అమ్ముడు అవుతున్నట్టు తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే అక్టోబర్ 19న భగవంత్‌ కేసరి ఇండియాలో రిలీజ్ అవుతుంటే ఒకరోజు ముందుగా అక్టోబర్ 18 మధ్యాహ్నం అక్కడ ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. లాస్ట్ టైం ఈ సంక్రాంతికి వచ్చిన బాలయ్య వీర సింహారెడ్డి సినిమాకి బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ప్రీమియర్ వసూళ్లు నమోదు అయ్యాయి.

ప్రీమియర్ వసూళ్లతోనే మిగిలిన మార్కుకు బాలయ్య చేరువయ్యాడు. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా ఖచ్చితంగా వీటిని బ్రేక్ చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఇటు బాలయ్య అఖండ – వీర సింహారెడ్డి లాంటి రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలతో ఉండడంతో పాటు కాజల్ అగర్వాల్, శ్రీలీల‌, తమన్‌ ఇటు అనిల్ రావిపూడి దర్శకుడు కావడంతో ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా రిలీజ్ కి ముందు.. రిలీజ్ తర్వాత కూడా సరికొత్త బ్రేకింగ్ రికార్డులు తన ఖాతాలో వేసుకోవడం కాయంగా కనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news