Newsఎన్టీఆర్ సినిమాపై ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ ఇచ్చేసిన ప్ర‌శాంత్ నీల్‌..!

ఎన్టీఆర్ సినిమాపై ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ ఇచ్చేసిన ప్ర‌శాంత్ నీల్‌..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఎక్కుతున్న ఈ సినిమాకు మిక్కిలినేని సుధాకర్ – నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతలు. ఇప్పటికే శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్.

జాన్వీక‌పూర్ తొలిసారిగా ఈ సినిమాతోనే సౌత్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. దర్శ‌కుడు కొరటాల శివ సముద్రం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ కండల హీరో సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో ఎన్టీఆర్ ను కొట్టే విల‌న్‌గా కనిపించనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కేజిఎఫ్ – సలార్‌ సినిమాల‌ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన 31 వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

హోంబలే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజయ్ కిరంగాదూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఎప్పుడో ప్రకటన వచ్చినా ఎప్పుడు ? షూటింగ్ స్టార్ట్ అవుతుంది అన్నదానిపై క్లారిటీ లేదు. తాజాగా సలార్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న నీల్‌ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సాలిడ్ అప్డేట్ అందించాడు. తమ ప్రాజెక్టు వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి పట్టాలెక్కుతుందని కన్ఫామ్ చేశాడు.

వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవర సినిమా రిలీజ్ అవుతోంది. అంటే దేవర సినిమా రిలీజ్ అయిన వెంటనే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్‌ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా షూటింగ్ మొదలైతే దానిపై హైప్‌ ఏ లెవెల్ కి వెళుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news