Newsఈ గ్యాంగ్‌లో ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోను గుర్తు ప‌ట్టారా... ఆ...

ఈ గ్యాంగ్‌లో ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోను గుర్తు ప‌ట్టారా… ఆ పేరుతోనే యూత్ వెర్రెక్కిపోతారు..!

కొన్ని ఏళ్లుగా సోషల్ మీడియాలో స్టార్ హీరో, హీరోయిన్ చిన్నప్పటి ఫొటోలు తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అలాగే సినీ తారల చైల్డ్ హుడ్ ఫోటోస్ చూసేందుకు.. వారి గురించి తెలుసుకునేందుకు నెటిజన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఇప్పుడు మరో స్టార్ హీరో ఫోటో తీసుకొచ్చాం. పైన ఫోటోను చూశారా..ఆ ఐదుగురు లో టాలీవుడ్ స్టార్ హీరో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు ?.. అతనెవరో గుర్తుపట్టగలరా?. అతను సినిమా వస్తే థియేటర్లో రచ్చే. అంతులేని ఫాలోయింగ్ ఉంది. ఇక పేరు చెబితే అభిమానులకు పూనకాలే.

ఓవైపు ఫ్యాన్స్ ని అలరించేందుకు మూవీస్ చేస్తూనే… మరోవైపు జనం కోసం రాజకీయంలోకి వెళ్ళాడు. ఇప్పుడు గుర్తుపట్టే ఉంటారు కదా. అతనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్‌ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు.

ఆ తర్వాత గోకులంలో సీత సినిమాతో మరోసారి అలరించిన పవన్ కళ్యాణ్.. 1999లో తొలిప్రేమ మూవీతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాకు జాతీయ అవార్డులతో పాటు… ఆరు నంది అవార్డులు కూడా వచ్చాయి. ఈ మూవీ తర్వాత పవన్ నటించిన తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాలతో స్టార్ డమ్ అందుకోవడమే కాకుండా అభిమానులను మరింత పెంచుకున్నాడు.

ప్రస్తుతం టాలీవుడ్ అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో పవన్ ఫస్ట్ హీరో. ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. మరోవైపు రాజకీయంలోనూ కొనసాగుతున్నారు. సాహో మూవీ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా చేస్తున్నారు. అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా కూడా చేస్తున్నాడు. ఇక ఇటీవలే బ్రో సినిమాతో ప్రేక్షకులను అలరించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news