Moviesవ‌రుణ్‌తేజ్ - సాక్షివైద్య అబ్బ ఇంత రొమాంటిక్ మూడ్‌లో ఉన్నారో చూశారా...

వ‌రుణ్‌తేజ్ – సాక్షివైద్య అబ్బ ఇంత రొమాంటిక్ మూడ్‌లో ఉన్నారో చూశారా ( వీడియో )

మెగా హీరో వరుణ్ తేజ్, రీసెంట్గా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరిలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఇక వరుణ్ తేజ్ అటు ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగు పెట్టేందుకు రెడీ అవుతుండడంతో పాటు ఇటు సినిమా లైఫ్ లో కూడా బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే వరుణ్ తాజాగా నటిస్తున్న సినిమా గాండీవధారి అర్జున.

ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్ల‌ర్లో అఖిల్ ఏజెంట్ భామ సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తోంది. నరైన్ రోషిణి, ప్రకాష్, మనీష్ చౌదరి, అభినవ్ గోమ‌ఠం, రవివర్మ, కల్పలత కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 25న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా మేకర్స్ మొదటి సింగిల్ నీ జతగా రిలీజ్ చేశారు. మిక్కీ జే మేయర్ స్వరపరిచిన ఈ మెలోడీస్ ట్రాక్ అదిరిపోయింది.

వింటున్న కొద్ది వినాలనిపించేలా ఉంది. ఈ పాటలో వరుణ్ సాక్షి వైద్య మధ్య అదిరిపోయే కెమిస్ట్రీ ఉన్నట్టు కనిపించింది. అలాగే ఇద్దరు మంచి రొమాంటిక్ మూడ్‌ ఎంజాయ్ చేస్తున్నట్టుగా స్టిల్స్ చెబుతున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన గాండీవధారి అర్జున టీజర్ కు కూడా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై సీనియర్ నిర్మాత భోగ‌వ‌ల్లి బాపినీడు ఈ సినిమా నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news