Moviesఅందుకు స్వీటి భయపడుతుందా..? "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" ప్రమోషన్స్ కి...

అందుకు స్వీటి భయపడుతుందా..? “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” ప్రమోషన్స్ కి అనుష్క రాకపోవడానికి కారణం ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా జేజమ్మ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు అనుష్క శెట్టి . సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనుష్క ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. మరీ ముఖ్యంగా తెలుగులో లేడి ఓరియంట్ ఫిలిమ్స్ కి పెట్టింది పేరుగా మారిపోయింది. అంతేకాదు తెరపై ఎంత హాట్ గా కనిపించినా తెర వెనక మాత్రం చాలా పద్ధతిగా కనిపిస్తుంది అనుష్క . అందుకే అభిమానులు ఈమెని ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు .

రీసెంట్ గా అనుష్క నటించిన సినిమా “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” . సెప్టెంబర్ 7న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎక్కడ చూసినా హీరో నవీన్ పోలిశెట్టి మాత్రమే కనిపిస్తున్నాడు . అనుష్క వాయిస్ వినిపిస్తుంది తప్పిస్తే ఎక్కడ ఫిజికల్ అపీరియన్స్ లేదు . అయితే దీనంతటికి కారణం ఆమె బర్య్వు అని తెలుస్తుంది . ఆమె ఈ మధ్యకాలంలో వెయిట్ బాగా పెరిగిపోయింది.

ఆమె తెరపై కనిపిస్తే ఖచ్చితంగా ట్రోలర్స్ ట్రోల్ చేస్తారు . అది సినిమాకి నెగిటివ్ పబ్లిసిటీ అవుతుంది . ఈ కారణంగానే మేకర్స్ ఇబ్బంది పడకూడదు అని లాస్ రాకూడదు అని అనుష్క శెట్టి సినిమా రిలీజ్ అయ్యే వరకు బయట కనిపించను అంటూ చెప్పుకొస్తుందట. అంతేకాదు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సైతం క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news