Moviesమోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీకి ఆ సూప‌ర్ హిట్ డైరెక్ట‌ర్ ఫిక్స్‌… నంద‌మూరి...

మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీకి ఆ సూప‌ర్ హిట్ డైరెక్ట‌ర్ ఫిక్స్‌… నంద‌మూరి ఫ్యాన్స్‌ను ఆప‌లేం..!

ప్రస్తుతం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది నట‌సింహం బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా అని చెప్పాలి. అయితే మోక్షజ్ఞ ఎంట్రీపై గత నాలుగైదు సంవత్సరాలుగా అనేక వార్తలు వస్తున్నాయి. ఇక కొద్ది నెలల క్రితం బాలయ్య వచ్చే ఏడాది మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం ఉంటుందని… ఎప్పటికే మోక్షజ్ఞ అమెరికాలో శిక్షణ తీసుకుంటున్నాడని క్లారిటీ ఇవ్వడంతో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న నందమూరి అభిమానుల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడినట్లు అయింది.

ఇక మోక్షజ్ఞ డెబ్యూ మూవీ డైరెక్టర్ కోసం ఇప్పటికే చాలామంది దర్శకుల పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది సంక్రాంతికు బాలయ్యకు వీర‌సింహారెడ్డి లాంటి మాస్ హిట్ సినిమా ఇచ్చిన మలినేని గోపీచంద్ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాను వారాహి చలనచిత్రం అధినేత.. బాలయ్యకు అత్యంత సన్నిహితుడు అయిన సాయి కొర్రపాటి నిర్మించనున్నారు.

లేటెస్ట్ గా బాలయ్య, మోక్షజ్ఞతో గోపీచంద్ జరిపిన ఓ కన్జర్వేషన్ వీడియో కూడా బయటకు వచ్చింది. ఇది కూడా ఈ సినిమా కథ ఎలా ? ఉండాలి అనే అంశంపై ముగ్గురు మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మలినేని రవితేజతో ఒక సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే వచ్చే యేడాది మోక్షజ్ఞతో గోపీచంద్ మూవీ ఉంటుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే పూర్తి క్లారిటీ రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news